ఎఫ్-16 ఫైటర్-జట్స్ ఉపయోగించటం లో దారి తప్పిన పాక్! అమెరికా షాక్!

భారత సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు ఎఫ్‌-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్ ప్రయోగించినట్టు పూర్తి సమాచారాన్ని ఆధారాలతో సహా భారత మీడియా బయట  పెట్టడంతో - యుద్ధ విమానాలకు సంబంధించిన సమాచారమివ్వాలని పాకిస్తాన్ ను ఆమెరికా కోరింది. కేవలం ఎఫ్‌-16 లను ఉగ్రవాద నియంత్రణ, ఉగ్రవాదుల స్థావరాల పై దాడులు చేయటానికి మాత్రమే ఉపయోగిస్తామని అమెరికాకు మాటిచ్చిన పాకిస్తాన్ తన మాట తప్పిన విషయం ఋజువైంది. 

కేవలం ఎఫ్‌-16 యుద్ధ విమానాలు మాత్రమే ప్రయోగించటానికి మాత్రమే ఉపయోగించే 'ఆమ్రామ్‌ క్షిపణి' శకలాలను భారత సైనికాధికారులు అంతర్జాతీయ మీడియా ముందు ప్రవేశ పెట్టీన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎఫ్‌-16 యుద్ధ విమానాల సరపరా ఒప్పందానికి విరుద్ధంగా విమానాలను పాకిస్తాన్ పొరుగుదేశంపై దాడికి ఉపయోగించడం జరిగిన దరిమిలా ఆ మొత్తం సమాచారాన్ని తమ ముందుంచాలని పాక్‌కు సూచించినట్టు అమెరికా రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు.

అయితే పాకిస్తాన్ ఎఫ్‌-16 యుద్ధ విమానాలను అసలు ఉపయోగించలేదని బుకాయిస్తుండటం గమనార్హం. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలపై మాత్రమే ప్రయోగించే 'ఆమ్రామ్‌ క్షిపణులు' కేవలం ఎఫ్‌-16 లు మాత్రమే ఉపయోగించగలవు. భారత్‌ పై దాడి చేసేందుకు వచ్చిన పాక్‌ ఎఫ్‌-16 ఫైటర్ జెట్స్ ను భారత మిగ్‌-21 విమానాలు అడ్డుకోవడంతో అవి వెనుదిరిగాయి. అయితే కొన్ని క్షిపణులును పాక్‌ భారత్ పై ప్రయోగించింది. వీటి శకలాలు కశ్మీర్‌ లోని రాజౌరి ప్రాంతం లో పడిపోగా వాటిని సేకరించిన భారత్‌ అంతర్జాతీయ మీడియా ముందు ప్రదర్శించడంతో పాక్‌ దుర్నీతి, దుర్మార్గం, దుష్ట తలంపు ప్రపంచానికి వెల్లడయింది. 
Mirage-2000 vs F-16 

గతంలో పాకిస్తాన్ కు ఎఫ్‌-16 ల అమ్మకాల విషయంలో అమెరికా చట్టసభ సభ్యులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే పాక్‌ అనుకూల లాబీయిస్టులు ఈ విమానాలను పాక్‌ ఉగ్రవాదంపై పోరుకు మాత్రమే వినియోగిస్తుందని హామీ ఇవ్వడంతో ఆ మేరకు ఒప్పందం చేసుకొని విక్రయించారు. అయితే ఆ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడిచి మాట తప్పినట్లు తెలుస్తుంది. 

అయితే, ఈ ఎఫ్ 16 విమానాలను ఏ దేశానికి చెందిన సైన్యం పైనా ఉపయోగించబోమని, ఉగ్రవాద నియంత్రణకు, ఉగ్రస్థావరా లపై దాడులకు మాత్రమే ఉపయోగిస్తామని ఒప్పందం చేసుకుని, అమెరికా నుంచి కొనుగోలు చేసింది పాకిస్తాన్. అయితే, పాకిస్తాన్ తాజాగా భారత సైన్యంపై ఎఫ్ 16 విమానాలను ప్రయోగించి ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.


ఎఫ్ 16విమానాలకు సంబంధించి పూర్తిసమాచారం ఇవ్వాల్సిందేనని పాకిస్తాన్‌కు స్పష్టంచేసింది. దీంతో ఇప్పుడు ఏం చేయా లో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది పాకిస్తాన్. ఈ విషయంలో అమెరికా ముందు పాకిస్తాన్ దోషిగా తేలితే మరోసారి అగ్రరాజ్యంతో ఆయుధ ఒప్పందానికి సంబంధించి తిప్పలు తప్పకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: