రాజధానిలో రాహుల్ గాంధికి కేజ్రీవాల్ ఝలక్: బీటలు వారిన మోడీ వ్యతిరేఖ కూటమికి

బీజేపీ వ్యతిరేక కూటమి లేదా కాంగ్రెస్-రాహుల్ గాంధి  నాయకత్వం లోని మహా కూటమి/పీపుల్స్ ఫ్రంట్/ మహాఘట్భంధన్ ఎక్కడా తన ఐఖ్యతను చూపటం లేదు. అంతకు మించి చెప్పాలంటే అది అప్రతిష్ఠాత్మకంగా నిట్టనిలువుగా  బీటలు వారింది. 

ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు లేదని తెలుగుదేశం పార్టీ అధినేత ఈ మహాకూటమికి జాతీయ స్థాయిలో నాయకత్వం వహిస్తున్నారని కొన్ని ప్రాంతీయ పత్రిక లు చెప్పే అధినేత చంద్రబాబు తేల్చేశారు.

ఉత్తర ప్రదేశ్ లో “మాయావతి - అఖిలేష్ కూటమి” ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఒక దిక్కులేని పార్టీగా మార్చింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో తృణమూల్ అధినేత మమతా బెనర్జీ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నదానికి సమాధానం ఉండదు. అక్షరాల క్షణ క్షణముల్ జవరాళ్ళ చిత్తముల్ అటుందన్నట్లు ఎప్పుడు అనుమానమే సస్పెన్సే!


తాజాగా రాహుల్ గాంధి కూటమికి మరో బ్రేక్ పడింది. డిలీలో తాము ‘ఒంటరి పోరు’ కే సిద్ధమన్నారు ఆం ఆద్మి పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. నిన్న మొన్నటి వరకూ బీజేపీ-కాంగ్రెస్ పార్టీలకు రాజకీయంగా సమదూరం పాటించిన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈసారి ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాలన్న తీవ్రమైన పట్టుదలతో వుంది. 

అందుకే చాలా కాలంగా రాహుల్ గాంధీతో భుజాలు భుజాలు కలసి డిల్లీ వీధుల్లో తిరిగేశారు సమయం సంధర్భం చూసి బిజేపిని-మోడీని తిట్టేశారు. ఆరవించ్ద్  కేజ్రీవాల్.  దరిమిలా ఢిల్లీలో “కాంగ్రెస్-ఆప్ పొత్తు” ఖరారైందన్న వార్తలు కూడా వచ్చేశాయి. అయితే డిల్లి కాంగ్రెస్ నాయకురాలు కాగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి షీలా దిక్షిట్ “ఆం ఆద్మి పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదు” అంటూ తేల్చేయటంతో ఈ ఊహాగానాలకు తెర దించుతూ ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్ సభ స్థానాల్లో ఆరింటికి అభ్యర్థుల్ని ప్రకటించేశారు ఆప్ కన్వీనర్ గోపాల్ రాయ్. పశ్చిమ  ఢిల్లీ మినహా మిగతా ఆరు ఎంపీ స్థానాల్లో అభ్యర్ధులకు  శుభాకాంక్షలు చెబుతూ సీఎం కేజ్రీవాల్ కూడా ట్వీట్ చేశారు.

‘ఆప్‌తో మాకు పొత్తు లేదు’ అంటూ షీలా దీక్షిత్ ప్రకటించిన 24 గంటల్లోపే కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో మరో కీలక మలుపు లాంటిదే. ఢిల్లీలో ముక్కోణపు పోటీ ఖాయమైనట్లు ప్రచారమైంది కూడా! ఇటు "ప్రీ-పోల్ అలయెన్స్‌"  తోనే మోదీని ఓడించగలమని ఇటీవల మహాకూటమి నేతలు డిసైడ్ అయినప్పటికీ.. ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం ఆసక్తిని రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: