టిడిపి తీరిలాగే ఉంటే “గల్లా గెలవటం కల్ల!” అన్నది క్షేత్రస్థాయి సమాచారం!

ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధిక అభియోగాలు ఉన్నా, నిఘా సంస్థలు వారి సంస్థల్లో గృహాల్లో సొదాచేసినా లేదా నేరచరిత్ర రూఢిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు వారిపై ఆర్ధిక విచారణ సంస్థలు విచారణ కోసం దాడి చేసినా - మాపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిపడిందని అంటున్నారు.  కాని ఆ నిఘా సంస్థలు ఎత్తి చూపిన నేరాభియోగాలను గుఱించి ప్రజలకు చెప్పట్లేదు.


రాష్ట్రంలో ఆదాయపన్ను సంస్థలు, సిబీఐ, ఎన్-ఫొర్స్మెంట్ డైతెక్టొరతె సంస్థ ఎందరిపైనో దాడి చేస్తున్నారు. వారు ఆ సంస్థలకు చట్టప్రకారం వివరణలు ఇచ్చుకుంటు న్నారు. అంతే కాని సిబీఐ లాంటి జాతీయ సంస్థలపై గాని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర్తభుత్వం పై గాని దాని అధినేతలపై గాని,  విరుచుకుపడటం లేదు. ముఖ్యంగా ఈ మద్య ఒక సామాజిక వగ లేదా రాజకీయ పార్టీ నాయకులు వారి సంబందీకుల వ్యాపార వాణిజ్య సంస్థలపై ఏ దాడి జరిగినా అది ఆ అభియోగస్తులపై దాడిగా కాక, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపై దాడిగా చెపుతూ ఆయా సంస్థల పై, కేంద్రంపై, ప్రధాని మోడీపై ముప్పేట దాడి చేస్తూ  అభియోగాలు చేస్తూ కాలం గడిపేస్తున్నారు.

ఇలాంటిదే మరో విషయం ఏమంటే: ప్రధాని నరేంద్ర మోడీపై గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అత్యంత కీలకవ్యాఖ్యలు చేశారు. వైసిపి అధినేత జగన్, తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌లతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన ప్రసంగం అనంతరం నరేంద్ర మోడీ తనపై కక్ష కట్టారని నేడు ఆయన ధ్వజమెత్తారు.

దీనిలో భాగంగానే ఈడీ తనను విచారణకు పిలిచిందని తెలిపారు. హాజరైన తనతో ఈడీ అధికారులు రెండు గంటలపాటు కఠినంగా వ్యవహరించారని గల్లా చెప్పారు. బడ్జెట్ ప్రసంగం తరువాత మరోసారి పలిపించారని జయదేవ్ వెల్లడించారు. తాను పక్కాగా పన్నులు కడుతున్నానని, రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్‌-వన్ ట్యాక్స్ పేయర్‌ ను నేనే అని,  తన వద్ద ఏ ఆధారాలు దొరకలేదు అని,  దీంతో తన బంధు, మిత్రులను సైతం ఐటీ అధికారులు వేధిస్తున్నారని జయదేవ్ ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని, అవసరమైతే జైలుకైనా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ కలిసి దేశంలో హిట్లర్ పాలన చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు.

దేశ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్య విషయాలు సైతంవారు ముగ్గురే కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.మోడీ-షాలు గుజరాత్ తరహా రాజకీయాన్ని దేశమంతా రుద్దాలని యత్నిస్తున్నారని జయదేవ్ ధ్వజమెత్తారు. వారికి కేసీఆర్, జగన్ కలిశారని గల్లా ఎద్దేవాచేశారు. ఈ సందర్భంగా ఒక విషయం గమనించాలి గల్లా జయదేవ్ పార్లమెంట్లో అందరు మాట్లాడిన విషయాలే తప్ప ఎక్కువగా మాట్లాడిందేమీ లేదు. మిస్టర్ ప్రైం మినిస్టర్ అని సంభోధించటం అదే మంత గొప్ప విషయమూ కాదు! భారతీయం కాదు. విదేశాల్లో దేశాధ్యక్షుల నుండి ప్రతి ఒక్కర్ని వారి హోదాలతో ప్రమేయం లేకుండా "మిస్టర్" అనే సంభోదిస్తారు. 

అసలు పార్లమెంట్ లో సవ్యంగా సంధర్భోచితంగా మాట్లాడింది రామ్మొహన నాయుడు. చక్కని హిందీలో ఆయన ఉపన్యాసం అనర్ఘళం. అలాంటి ఆయన్ని ఆనాడు రెండురోజులు ప్రస్తావించి వదిలేసింది ఆనాడు పచ్చ మీడియా, అదీ వారి సామాజికవర్గ అభిమానంతో గల్లా జయదేవ్ ని ఆకాశానికి ఎత్తేసిందన్నది – మిగతా సామాజిక వర్గాల వాళ్ళు అంటున్నారు. 

ఇలాంటి సంఘటనలు అందరూ మనసులో రికార్డ్ చేసుకుంటున్నారు. అందరూ 2019 ఎన్నికలకోసం వేయికళ్ళతో నిరీక్షిస్తున్నారు అన్నది క్షేత్రస్థాయి సమాచారం. ఇక గుంటూరులో  గెల్లా గెలవటం కల్ల అంటున్నారు. ఇక టిడిపి అంటారా! బర్డ్ ఆఫ్ సేం ఫెదర్ ఫ్లాక్స్ టూగెదర్ అనేదానికి ఋజువుగా చరిత్రలో నిలవనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: