ఈ లెక్క పక్కా - సర్జికల్ స్ట్రైక్‌ లో చనిపోయిన టెర్రరిస్టులు 300 నిజమే అనవచ్చు

మన రాజకీయ నాయకులకు అసలు బుద్ధిలేదనే చెప్పాలి. సర్జికల్ స్ట్రైక్స్ చేసి 40 మంది జవాన్లను చంపేసిన జైష్-ఏ-మహ్మద్ ఉగ్ర తండా పై దాడి చేసి భారతీయులు కోరినట్లు పగతీర్చింది భారతీయ వాయుసేన. అందులో సుమారుగా 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం వచ్చింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ ఆఙ్జానువర్తులైన వాయుసేన ఈ ఆపరేషన్ నిర్వహించింది.


వ్యూహం కృషి రెండూ సైన్యానిదే - ఇందులో మేమేదో చేశామని నరెంద్ర మోడీ చెప్పిందేమీ లేదు. కాని ఇతర ప్రతిపక్షాల వారికి బిజేపి కి ఓట్లెక్కడ పడిపోతాయేమో నని భయం. 


* భారత సైన్యానికి సెల్యూట్ అన్నారు - 
* బిజేపి ప్రభుత్వం సైన్యం చేసిన పని తమ ఖాతాలో వేసుకోవద్దని అన్నారు
* ఏకంగా మమత బెనర్జీ సర్జికల్ స్ట్రైక్ గురి తప్పిందని అన్నారు
* చంద్రబాబు, సిద్ధు, మమత ఏకంగా పాకిస్తాన్ ప్రధానిని పొగిడేశారు - ఆయన్ని చూసి నరెంద్ర మోడీ నేర్చుకోవాలన్నారు
* పవన్ కళ్యాన్ మాత్రం పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతుందని రెండేళ్ళ క్రితమే బిజేపి చెప్పినది అన్నట్లు వార్తలు వచ్చాయి. 


చివరకు 300 మంది వాయుసేన ద్వంసం చేసిన ఆ శిబిరాల్లో చనిపోలేదు! అన్న వార్తలకు అడ్డుకట్ట వేస్తూ - లాజికల్ గా సమాధానం వచ్చింది అదేమంటే: 

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పి ఓ కె) లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన "సర్జికల్ స్ట్రైక్‌" పై యావత్ దేశం ప్రశంసల వర్షం కురిపించింది. భారత సైన్యం ధైర్య సాహసాలను అభినందనల్లో ముంచెత్తింది. అయితే, తాజాగా ఈ సర్జికల్ స్ట్రైక్‌ కు సంబంధించి అధికార విపక్షాల మధ్య కొత్తవివాదం తలెత్తింది. సర్జికల్-స్ట్రైక్‌ కు సంబంధించిన ఆధారాలు చూపాలని, నిజంగా టెర్రరిస్టులు ఎంతమంది చనిపోయారో? చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది.


నిజానికి సర్జికల్-స్ట్రైక్‌ లో ఎంతమంది చనిపోయారనే లెక్క పక్కాగా ఎలా తెలుస్తుంది? తెలియకపోయినా.. 300 నుంచి 400 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు ఊహాజనిత ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక సమాచారం తెలియరాలేదు. అయితే, భారత వాయుసేన జరిపిన మెరుపుదాడుల్లో ఎంత మంది చనిపోయారనే దానికి ఇప్పుడొక చక్కని ఆధారం దొరికింది. 


ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, "బాలాకోట్‌లో వాయుసేన దాడులకు ముందు రోజు వరకు అక్కడ 300 సెల్‌ఫోన్ కనెక్షన్లు మనుగడలో ఉండేవి. అయితే, భారత వాయుసేన జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత.. అవి పని చేయడం లేదు. అక్కడ సిగ్నల్స్ అన్నీ ధ్వంసమై పోయాయి. 'నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్' ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి మొబైల్ కనెక్షన్లూ యాక్టివ్ మోడ్ లో లేవని చెప్పింది" 

అయితే, భారత ప్రభుత్వం గానీ, వాయుసేన గానీ ఇప్పటివరకూ సర్జికల్ స్ట్రైక్‌లో ఇంతమంది చనిపోయారంటూ ఒక స్పష్టమైన ప్రకటనను విడుదల చేయలేదు. దీనిపై విపక్ష కాంగ్రెస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఎంతమందిని చంపారో? లెక్క చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, విడుదలైన ఈ సమాచారం ప్రకారం లెక్క పక్కానేనా? , లేక ఇంకేమైనా తేడాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది.

India's cyber security agencies

లేక పక్కా లెక్కలు తెలియాలంటే ప్రతిపక్ష పార్టీలు "అక్కడికెళ్ళి పరిశీలించి లేదా నిజనిర్ధారణ కమిటీ వేసి నిజాన్ని నిర్ధారిస్తే మంచిది" దిక్కుమాలిన ఈ బుద్ధి తక్కువ పనులు మానేసి పాకిస్తాని ప్రసిడెంట్స్ లాగా ఎన్ని రాజకీయ విభేదాలున్నా - వైరి పాకిస్తాన్ విషయంలో ఐఖమత్యం కలిగి ఉంటే మంచిది. సైన్యాన్ని అంటే భారతీయ వాయుసేనకు మరింత ఐఖ్య ప్రత్సాహం ఇస్తే జనం మెచ్చుకుంటారు. సైన్యానికి ప్రోత్సాహం దొరుకుతుంది. 


   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: