సీరియస్ అయినా చంద్రబాబు..!

KSK
రెండు తెలుగు రాష్ట్రాల ను డేటా కేసు కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ కేసు గురించి జాతీయ స్థాయిలో ఉన్న నేతలు కూడా నోరెళ్ళ పెడుతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డేటా కేసు పరిణామాల గురించి ప్రస్తావిస్తూ ఆగ్రహం తో ఊగిపోయారు.


ప్రభుత్వ కార్యక్రమంలో మరియు భారీ బహిరంగ సభలో కూడా ఎక్కడైనా సరే ఈ కేసు గురించి ప్రస్తావన తీసుకు వస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మరియు వైసీపీ పార్టీ అధినేత జగన్ పైన దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.


ముఖ్యంగా ప్రభుత్వ డేటా ఎలా ప్రైవేటు సంస్థకు వెళ్లిందన్నదానిపై మాట్లాడకుండా మిగిలిన విషయాలన్ని చెబుతున్నారు. టిడిపి డేటా ను టిఆర్ఎస్ చోరీ చేస్తోందని ఎదురు ఆరోపిస్తున్నారు.అలాగే వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఓట్లు తొలగిస్తోందని అంటున్నారు.


టిఆర్ఎస్ ఒక కేసు పెడితే తాను నాలుగు కేసులు పెడతానని హెచ్చరించారు. హైదరాబాద్‌ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని గుర్తు చేశారు. అనవసరంగా తమను రెచ్చగొట్టాలని చూస్తే గట్టిగా జవాబిస్తామని చంద్రబాబు అంటున్నారు. రిటర్న్ గిప్ట్ ఇస్తే ప్రజలలో మీపైనే వ్యతిరేకత వస్తుందని కూడా ఆయన అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: