ఎడిటోరియల్ : వైసిపి, టిడిపి వైపు చూస్తున్న పవన్

Vijaya

అవును మీరు చదివింది నిజమే. అయితే పై రెండుపార్టీల్లో చేరటానికి పవన్ చూడటం లేదు. పై పార్టీల్లో నుండి బయటకు వచ్చేసే నేతల కోసమే పవన్ ఆ పార్టీల వైపు చూస్తున్నారు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయ్. అందుకే అధికార, ప్రధాన పార్టీల్లో అభ్యర్ధుల కోసం అధినేతలు చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు కూడా ఎవరికి వారుగా అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు.

 

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఇప్పటికి 10 లోక్ సభ నియోజవర్గాల్లోని అసెంబ్లీలపై సమీక్షలు కూడా పూర్తి చేశారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ విషయంలో కొందరికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. జగన్ కూడా ఇదే పనిని ఎప్పటి నుండో మొదలుపెట్టేశారు. పాదయాత్ర సందర్భంగానే సుమారు 15 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను బహిరంగంగానే ప్రకటించేశారు. అంటే అభ్యర్ధులను ఫైలన్ చేయటంలో ఇద్దరు అధినేతలు బాగా బిజీగానే ఉన్నారు.

 

మరి జనసేన అధినేత పవన్ కల్యాన్ మాటేమిటి ? ఏమిటంటే ఎవరికీ తెలీదు. ఎందుకంటే పవన్ మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నా ఇంతవరకూ పార్టీలో పవన్ కల్యాణ్ తప్ప చెప్పుకోతగ్గ బలమైన నేత మరొకరు కనబటం లేదు. నాదెండ్ల మనోహర్, రావెల కిషోర్ బాబు తప్ప మూడో నేత కూడా జనాలకు తెలీదు.


నిజం చెప్పాలంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి జనసేనకు అసలు అభ్యర్ధులే లేరు. అసెంబ్లీకి లేరంటే ఇక లోక్ సభ నియోజకవర్గాల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అందుకనే వైసిపి, టిడిపిల్లో టికెట్లు దొరకని నేతల కోసం ఎదురు చూస్తున్నట్లుంది. పై రెండు పార్టీల్లోను టికెట్లు దొరకని నేతల్లో చాలామంది పార్టీని వదిలేసి బయటకు వచ్చేసే అవకాశాలున్నాయి.

 

అలాంటి వాళ్ళంతా జనసేనలో చేరటానికి అవకాశాలున్నాయి. అందుకనే అభ్యర్ధుల ఎంపిక విషయంలో పవన్ చాలా నింపాదిగా ఉన్నారు. మొన్ననే టికెట్ల ఆశించే వాళ్ళ నుండి పవన్ దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తులు చూసి టికెట్లిస్తే చాలా నియోజవర్గాల్లో జనసేనకు కనీసం డిపాజిట్ కూడా దక్కదు. ఆ విషయం పవన్ కు తెలీక కాదు దరఖాస్తులు తీసుకున్నది. పార్టీలో ఏదో హడావుడి కనబడాలి కాబట్టే ఏదో ఓ తంతు నడుపుతుంటారంతే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: