కెసిఆర్ సర్కారు మీద బాబు సర్కారు పరువు నష్టం దావా కేసు ?

KSK

డేటా చోరీ వివాదం తీవ్రంగా ముదురుతోంది .. ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన ఓటర్ల కి చెందిన పర్సనల్ డేటా ని ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చింది అంటూ వైకాపా తీవ్ర ఆరోపణలూ , ఫిర్యాదులూ చేస్తున్న క్రమం లో ..



రీసెంట్ గా తక్కువ వ్యవధి లోనే గవర్నర్ ని బీజేపీ - వైకాపా నాయకులు కలవడం విశేషం. మరొక పక్క.. డేటా చోరీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది .. తమ ప్రభుత్వాన్ని , తమ ప్రభుత్వం యొక్క డేటా నీ తెలంగాణా సర్కారు దోచుకుంది అనే లెక్కలో తెలంగాణా ప్రభుత్వం మీద పరువు నష్టం దావా వెయ్యడానికి సిద్ధం అయ్యింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.


జూపూడి రీసెంట్ గా మీడియా తో మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం తమా రాష్ట్ర డేటా ని చోరీ చేసింది అనీ దీన్ని ఆధారం గా చేసుకుని మేము కూడా కేసు పెడతాం అన్నారు ఆయన. " తెలంగాణా పోలీసుల మీది ఒక రాజకీయ పార్టీ గా ఫిర్యాదు చెయ్యబోతున్నాం.

ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రము కబళించే నేపధ్యం కనిపిస్తోంది. మేము ఇది తేలికగా వదిలి పెట్టాము " అన్నారు ఆయన. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: