'ముఖ్యమంత్రే అసమర్ధతను ప్రకటించారు' కాబట్టి, న్యాయవ్యవస్థ పాలన సరిదిద్దవచ్చా?

నా ఓటే తొలగిస్తారేమో! ఇదీ తాజాగా నారా చంద్రబాబునాయుడు మాటలు. ఆయన ఒక ముఖ్యమంత్రేనా? ఏ మౌతుంది రాష్ట్రం. ఒక ముఖ్యమంత్రి ఓటు ఎవరైనా తొలగించగలరా? ముఖ్యమంత్రి అసమర్ధుడైతే అలా జరగవచ్చేమో గాని, నలభైయేళ్ల సుధీర్ఘ అనుభవం ఉండి దేశంలోని అందరు ముఖ్యమంత్రులు కంటే సీనియర్ అవటమే కాదు,  దేశ ప్రధాని కంటే కూడా సీనియర్ గా తనకు తానే చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి అసమర్ధుడని చెపితే ఆయన ఊరుకుంటారా? అంతేకాదు అసలు ఆయన ప్రభుత్వం నడుపుతున్నారా? 

తన పాలన మరచిపోయి ప్రభుత్వంపై న్యాయపోరాటం ధర్మపోరాటం చేస్తున్నారంటే ఆయన అధినేతగా ఉన్న ప్రభుత్వంలో న్యాయం ధర్మం లేవనే కదా! అర్ధం. ఉమ్మడి రాజధాని వదలిపెట్టి రాత్రికి రాత్రి అమరావతి పారిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాడే ఆ పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారు. అయినా ఆయన ముఖ్య మంత్రిగా ప్రజలు ఆయన అనుభవం చూసి ఒకే అని అనుకున్నారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా కంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు గానే పనిచేస్తున్నారు  


ప్రజలు బిజెపి అధినేత నరేంద్ర మోడీతో గాని పవన్ కళ్యాన్ తో గాని ప్రజలు పొత్తు పెట్టుకున్నారా? వారితో టిడిపి పొత్తు పెట్టుకొని అందరు కలసి అర్ధిస్తే, ప్రజలు ఓటేశారు. తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చారు. ఇక ప్రజలకు యిచ్చిన వాగ్ధానాలు రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అధినేత మాత్రమే సాధించిపెట్టాలి. అది వదిలేసి ఆ అధినేత దీక్షలు మొదలెట్టటం సిగ్గులేనితనం, సిగ్గుమాలినతనం గాదా! 

అందుకే ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే లేదని నిర్ధారణ అయింది! అన్నట్లే కదా! అందుకే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు చెందిన విలువైన సమాచారం చోరీకి గురైంది. అధినేత ప్రతిపక్ష నాయకుడుగా మారి పాలనా పగ్గాలు వదిలేస్తే ఆ గుర్రాలు ఎటైనా పరుగెడతాయి. అందుకే పట్టపగ్గాలు లేని ఆ రాష్ట్ర పాలన లో దొంగలు 'ఐటి గ్రిడ్స్'  రూపంలో ఆశోక్ సారధ్యంలో,  ప్రభుత్వంలోని పెద్దలు, ఐటి మంత్రి సహకారంతో ప్రజాసమాచారం చోరీకి గురైంది అదీ 'బ్లూ ఫ్రాగ్స్ టెక్నాలజీ కంపని' దేనితోనైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఒప్పందం కుదుర్చుకుందో దాని ద్వారా.


అయితే ఈ కంపనీ అసలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపనీ లో రిజిస్టరే కాలేదు. రిజిస్ట్రేషనే లేని కంపనీతో అత్యంత సున్నితం అత్యంత భద్రతలో ప్రభుత్వం వద్ద ఉండవలసిన విలువైన సమాచారం ఉంచటం, అసలు ఊరు పేరు లేని "బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీ కంపనీ" తో  ప్రభుత్వం ఒప్పందం ఎలా చేసుకుంది. ప్రభుత్వానికి ఇదీ కూడా తెలియదా? అంటున్నారు విశ్లేషకులు.  బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీ కంపనీ ద్వారా  ఐటి గ్రిడ్స్ కంపనీకి సమాచారం చేరటం ఆందోళన కలిగిస్తుంది. 

ఈ మొత్తం ప్రజా సమాచారం ఇక ఎటువైపు వెళ్ళిందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అలాంటి వాతావరణంలో నా ఓటే తొలగిస్తారేమో? అన్న ముఖ్యమంత్రి మాట రాష్ట్రం లో పాలన ఉందా? ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే మాయమైందా? అనేది ప్రధాన ప్రశ్న.


కనీసం రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉనికిలోనే ఉందని రాజ్యాంగ వ్యవస్థలైన శాసననిర్మాణ వ్యవస్థ గాని,  అధికార వ్యవస్థ గాని ఋజువు చేయలేకపోతే, కనీసం న్యాయ వ్యవస్థ అయినా  సుమోటోగా ఈ కేసును తీసుకుని రాష్ట్రం లోని పాలనను పునఃప్రతిష్టించవచ్చా? కనీసం అలా జరగటం అవసరమనిపిస్తుంది. 
         

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: