చంద్రబాబు ఇంట్లో అంతా సినిమా వాళ్ళె! జయసుధ సెటైర్స్

చంద్రబాబును రాజకీయాన్ని విడదీయలేం. ఎందుకంటే రెండూ కవలపిల్లలు కాబట్టి. ఎం మాట్లాడినా అంతర్లీనంగా రాజకీయం కుటుంబం కులలు తప్ప మరేమీ చెప్పుకోదగిన విషయాలు ఉండవని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఆయన బాగుంటే ప్రపంచం బాగున్నట్లే! ఆయన బాధలన్ని ప్రపంచపు వ్యధలే! ఇదీ ఆయన తీరు. ఆఖరకు అక్కినేని నాగార్జున వైసిపి అధ్యక్షుణ్ణి కలవటంపై కూడా వదలకుండా కామెంట్ చేశారు. 


హీరోయిన్ జయసుధ ఈ ఉదయం లోటస్ పాండ్ కు వెళ్లి జగన్ సమక్షంలో పార్టీ కండువ కప్పుకుని వైసీపీలో చేరారు. ఆమెతో పాటు ఆమె తనయుడు కూడా వైసీపీలో చేరాడు. అనంతరం మీడియాతో మాట్లాడిన జయసుధ, మళ్లీ తన ఇంటికి తాను వచ్చినట్లుగా అన్పిస్తుందని అన్నారు. తనని రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  ఎంతోమంది సీనియర్లు ఉన్నా కూడా వాళ్లందర్ని కాదని వైఎస్ఆర్ తనని పిలిచి టిక్కెట్ ఇచ్చి తన గెలుపునకు కృషి చేశారని అన్నారు. ఇప్పుడు వైసీపీ లోకి రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన జయసుధ, పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని, అలాంటి అవకాశం లేకపోతే, పార్టీ కోసం ప్రచారానికి వస్తానని చెప్పారు.

 

ఈ సందర్భంలో కొంతమంది విలేఖరులు జగన్ తో నాగార్జున భేటీ గురించి ప్రస్తావించారు. అలాగే సినిమా వాళ్లు జగన్ లాంటి వ్యక్తులను కలవడం దురకష్టకరమని చంద్రబాబు వ్యాఖానించడాన్ని కూడా జయసుధ వద్ద ప్రస్తావించారు. నాగార్జున సినిమా నటుడిగా జగన్ను వచ్చి కలవలేదని.. వైఎస్ కుటుంబానికి దగ్గని వ్యక్తిగా వచ్చి కలిశాడని అన్నారు. అయినా సినిమావాళ్లు రాజకీయ నేతల్ని ఎందుకు కలవకూడదు అని ఆమె ప్రశ్నించారు. 


అయితే దానిపై  — సినీ నటుడు నాగార్జున వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిని కలవడంపై సినీనటి జయసుధ స్పందించారు. కొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉన్న సినీనటి జయసుధ గురువారం వైసీపీలో చేరారు. 

హైదరాబాదు లోని లోటస్‌ పాండ్‌కు వెళ్లి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశం లో పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్‌-నాగార్జున భేటీ పై చంద్రబాబు చేసిన విమర్శలపై జయసుధ స్పందించారు. 

జగన్ లాంటి వ్యక్తులను సినీనటులు కలవడం దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ మాటలు చంద్రబాబు మాట్లాడకూడదని, ఎందు కంటే ఆయన కుటుంబ సభ్యులంతా సినీ ఇండస్ట్రీ  చెందిన లేదా సంబంధమున్న వాళ్ళే కదా! అని జయసుధ చెప్పారు.  సినీనటులు ఎందుకు వైఎస్ జగన్మోహనరెడ్డిని కలవకూడదని ఆమె ప్రశ్నించారు. సినిమా వాళ్లంటూ ప్రత్యేకంగా లేదా వారిని తక్కువచేసి మాట్లాడాల్సిన అవసరం లేదని, వాళ్లు కూడా ఈ దేశంలోని ఇతరుల్లా సాధారణ  ఓటర్లేనని జయసుధ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: