డేటా చోరీ : టీడీపీకి కోలుకోలేని దెబ్బ ..!

Prathap Kaluva

డేటా చోరీ వ్యవహారం ఇప్పుడు టీడీపీకి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ వ్యవహారం లో టీడీపీ అడ్డంగా బుక్ అవ్వటంతో కక్కలేక మింగ లేక ఉంది. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అసలు గుట్టును బయటపెట్టింది. ఇక ఇతర రాజకీయ పరిణామాలు కూడా తెలుగుదేశం పార్టీకి నెగిటివ్ గానే మారాయి.ఈ నేపథ్యంలో.. తెలుగుదేశం గ్రాఫ్ చాలా వరకూ కుంగిపోతోందని సమాచారం.


ఏకంగా మూడు శాతం ఓటు బ్యాంకును తెలుగుదేశం పార్టీ కోల్సోయిందని సమచారం. వారం రోజుల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ ఈ మేరకు నష్టపోయిందని.. పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ హైక్ చోటు చేసుకుందని.. జగన్ వైపు మూడు శాతం ఓటు బ్యాంకు పెరిగిందని విశ్లేషిస్తున్నారు క్షేత్ర స్థాయి పరిశీలకులు.


ఎన్నికల ముందు డేటా చౌర్యం వ్యవహారం బయటపడటం తెలుగుదేశం పార్టీకి పెను కుదుపుగా మారుతూ ఉంది.అప్పటికే చంద్రబాబు నాయుడు ఓటు షేర్ ముప్పై ఆరు శాతానికి పడిపోయిందన్నారు. జగన్ ఓటు షేర్ దాదాపు నలభై ఐదు వరకూ కనిపించింది. ఇలాంటి నేపథ్యంలో మరో మూడు శాతం లాస్ కావడం అంటే.. తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికల్లో తగిలేది గట్టి దెబ్బే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: