డేటా చోరీ కేసు : డేటా మొత్తం స్వాధీనం చేసుకున్న పోలీసులు

KSK

తెలంగాణా పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ ప్రస్తుతం తమ యొక్క కార్య కలాపాలలో వేగం పెంచుతోంది. ప్రస్తుతం డేటా చోరీ వ్యవహారం మీద పోలీసులు చకచకా తమ పని చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.

ఈ కేసుకు సంబంధించిన డేటా మొత్తం స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. తమ దగ్గర పెట్టుకుని యనలైజ్ చేస్తున్నారు. తమ దగ్గర ఉన్న డేటా ని పై అధికారుల దగ్గరకి పంపిస్తున్నారు.

ఎఫ్ ఎస్ ఎల్ కి పంపుతున్నాం అని స్టీఫెన్ రవీంద్ర కూడా తెలిపారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణా పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థ కి సంబంధించి ఫిర్యాదు అందడం తో వారి సంస్థ మీద రైడ్ చేసిన సంగతి తెలిసిందే.

ఐటీ గ్రిడ్స్ కీ టీడీపీ యొక్క సేవా మిత్ర యాప్ కీ మధ్యలో ఏం నడిచింది ఏ రకంగా డేటా ట్రాన్స్ఫర్ అయ్యింది అనేదాని మీద పోలీసులు డేగ కన్ను వేసి మరీ చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: