ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి..!

KSK
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని కుదిపేశాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం వల్ల కాంగ్రెస్ పార్టీకి సరైన స్థానాలు రాలేదని ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో వచ్చిన ఫలితాల తర్వాత చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేశారు. ఈ క్రమంలో త్వరలో పార్లమెంటుకు ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న నేపథ్యంలో విజయశాంతి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి.


టిఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి,మోడీకి ఓటు వేసినట్లేనని కాంగ్రెస్ పార్టీ ప్రచార సారది విజయశాంతి విమర్శించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్లీ చేయొద్దని కాంగ్రెస్‌ నేత విజయశాంతి ప్రజలను కోరారు. శంసాబాద్ బహిరంగ సబలో ఆమె ప్రసంగిస్తూ, అసెంబ్లీ ముగిసింది.. పార్లమెంట్‌ మొదలైంది. ఇది కాంగ్రెస్‌కు, భాజపాకు జరిగే యుద్ధం.


అంటే రాహుల్‌గాంధీ-మోదీలకు జరిగే యుద్ధం. ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్‌గాంధీ పోరాడుతుంటే, దాన్ని ఖూనీ చేసి, మోదీ నియంతలా పాలించారని ఆమె అన్నారు. మళ్లీ పరిపాలించాలని అనుకుంటున్నారని విజయశాంతి ద్వజమెత్తారు.


ఈసారి దేశ ప్రజలు ఆ అవకాశం ఇవ్వరు. మోడీ ఏ సమయంలో ఏ బాంబు వేస్తారోనని ప్రజలు వణికిపోతున్నారు. ఒక ప్రధానికి ఇది కాదు లక్ష్యం. జీఎస్‌టీ, నోట్లరద్దు, పుల్వామా ఇలా ప్రతి దాని విషయంలో ప్రజల్లో భయం మొదలైంది. ఈసారి మీరంతా ఆలోచించుకుని ఓటు వేయాలని కోరుతున్నానని ఆమె అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: