చంద్రబాబుకు ధీటుగా జగన్ ఎదగడానికి దోహదం చేసిన 5 కారణాలు ..!

Prathap Kaluva

ఆంధ్ర ప్రదేశ్ ప్రతి పక్ష నేత జగన్ మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో సీఎం కావటం ఖాయమని ఇప్పటికే జాతీయ సర్వేలు తేల్చేశాయి. కేవలం నాలుగు పదుల వయసులో ఉన్న జగన్... ఓ పదేళ్లు నిండని పార్టీకి అధినేతగా ఉంటూ... ఏకంగా ఏపీలో అధికారం చేజిక్కించుకునేంతగా ఎలా ఎదిగారన్న విషయం నిజంగానే ఆసక్తికరమే.  అందులోనూ 40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యూహాలను తట్టుకుని జగన్ నిలబడగలుతున్నారన్న విషయం కూడా మరింత ఆసక్తికరమే. 


మొదటి కారణం చూస్తే ,  వైఎస్ బతికున్నంత కాలం టీడీపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే. అయితే వైఎస్ అకాల మరణంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. వైఎస్ వెంట నడిచిన కాంగ్రెస్ శ్రేణులంతా జగన్ వైపునకే మళ్లాయి. కొంతమంది నేతలు మినహా మెజారిటీ నేతలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల బలమంతా వైసీపీవేపే మళ్లింది. ఇక రెండో అంశానికి వస్తే... వైఎస్ వారసత్వం. ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్ కూ రాష్ట్రంలోని బలమైన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అండగా నిలిచింది. అదే సమయంలో క్రిస్టియన్ గా రాష్ట్రంలోని మెజారిటీ క్రిస్టియన్లు జగన్ వైపే నిలబడ్డారు.


ఇక మూడో అంశం విషయానికి వస్తే... నాడు వైఎస్ రాజశేఖరరెడ్డికి అధికారం చేజిక్కడానికి పాదయాత్ర ఎలా ఉపయోగపడిందో.... దాని తరహాలోనే ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర వైసీపీకి మోర్ ప్లస్గా మారింది. ఇక నాలుగో అంశం విషయానికి వస్తే... 13 జిల్లాలుగా ఏర్పడిన ఏపీలో చంద్రబాబు సర్కారు కొనసాగించిన పాలనను ఎక్కడికక్కడ తూర్పారబట్టిన జగన్... ప్రజల్లో టీడీపీ పట్ల ఉన్న సానుకూలను భారీగా దెబ్బ కొట్టేశారు. ఇక ఐదో కారణం జగన్ మొక్కవోని దీక్ష , పట్టుదల, అధికారం లోకి రావాలనే కాంక్ష అన్ని వెరసి జగన్ .. చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా తయారయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: