ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాల నియోజికవర్గాల పై సమీక్ష - AP హెరాల్డ్ ఎక్స్ క్లూజివ్

KSK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో మొత్తం 175 స్థానాలు ఉండగా అందులో 29 స్థానాలు ఎస్.సీ కోటకు మరియు ఏడు స్థానాలు ఎస్.టీ. కోటాకు కేటాయించారు. మొత్తం ఈ 175 స్థానాలు 13 జిల్లాలలో కేంద్రీకరించబడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం అనబడు ఈ 13 జిల్లాలు విభజన తరువాత మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. 


ఇప్పుడు ఆయా నియోజకవర్గాల వారీగా ప్రతి జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు మరియు ఆయా పార్టీల బలాబలాల గురించి చర్చించుకుందాం.

శ్రీకాకుళం

ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉండే శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్టణంలో స్వచ్ఛమైన నీరు సమృద్ధిగా అందుబాటులో ఉంది. అది కాకుండా మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ-గవర్నెన్స్ చాలా విజయవంతంగా అమలులో ఉంది. ఆ జిల్లా కలెక్టరు చక్రధర్ బాబు కేంద్రీయ స్థాయిలో అవార్డు కూడా తీసుకున్నారు.

విజయనగరం

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలలో విజయనగరం ఒకటి. ఎప్పటినుండో ఈ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చేది. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ విజయభేరీ మోగించడం తో ఈ ఎన్నికల్లో కూడా పోరు ఈ రెండు పార్టీల మధ్యనే ఉండొచ్చు అని అంచనా.


విశాఖపట్నం

ఈ జిల్లాలో పరిశుద్ధ సమస్యలు కొంచెం ఎక్కువే. పెద్ద పెద్ద హోటల్లో మరియు రెస్టారెంట్లలో కూడా ఇలాంటి ఎన్నో సమస్యలు చూడవచ్చు. ఇప్పటివరకు ఈ విషయం మీద ఎటువంటి స్పష్టత అనేది రాలేదు. ఇక వాణిజ్య విషయానికి వస్తే ఈ మధ్యనే విశాఖపట్నంలో లో గ్లాస్ కర్మాగారానికి రెండు వేల కోట్లు కేటాయించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు గానూ ఈ జిల్లాలో దాదాపు 4052 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు


రానున్న ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల నుండి 46 మంది అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ జిల్లాలలో వన్యమృగాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యనే వాటి చర్మాన్ని విక్రయిస్తున్న ఇద్దరు నేరస్తులను కూడా పట్టుకున్నారు. ఈ రెండు జిల్లాల్లో కలిపి దాదాపు మూడు లక్షల ఓటర్లు ఉండగా, రానున్న లోక్సభ ఎన్నికలకు గానూ పశ్చిమగోదావరి జిల్లాలో 3411 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.


కృష్ణా మరియు గుంటూరు 

ఈ రెండు జిల్లాలలో కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొత్తం అసెంబ్లీ స్థానాలను మరియు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ రెండు జిల్లాలకు కలిపి మొత్తం 362 పోలింగ్ స్టేషన్ లు ఉండగా 153 కృష్ణాజిల్లా కి ఉండగా మిగతా 253 కేంద్రాలు గుంటూరు జిల్లాలకు కేటాయించారు. ఈ రెండు జిల్లాలలో సమస్యలు ఎక్కువగా ఉండడంతో జిల్లా కలెక్టరు ఈ సారి అన్ని నియోజకవర్గాలను గూగుల్ మ్యాప్స్ కు కనెక్ట్ చేసినట్లు ప్రకటించారు. గత ఆరు నెలల్లో గుంటూరు జిల్లాలో పదివేల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా కృష్ణాజిల్లాలో 4015 ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో 14 స్థానాల్లో రెండు స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది.



ప్రకాశం మరియు నెల్లూరు
ఈ రెండు జిల్లాల్లో పోరు హోరాహోరీగా అనే చెప్పాలి. టిడిపి, వైఎస్ఆర్సిపి మరియు జనసేన ఆధిక్యత పై కన్నేశాయి. సంప్రదాయంగా కాంగ్రెస్ కంచుకోట గా వస్తున్న నెల్లూరు జిల్లా గత ఎన్నికల్లో మాత్రం ఈ స్థానాలను కోల్పోయింది. జగన్ కు మాత్రం ఈ జిల్లాలో కొంచెం పట్టు ఎక్కువగా ఉందనే చెప్పాలి. 



కడప మరియు కర్నూలు

కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ పూర్తి ఆధిక్యత సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జమ్మలమడుగు లాంటి ఒకటి రెండు స్థానాలు మినహాయిస్తే జగన్ హవా ఇక్కడ ఎక్కువగా కొనసాగే అవకాశాలు మెండు. కర్నూలు జిల్లాలో కోట్ల ఫ్యామిలీ చేరికతో టిడిపి మంచి మెజారిటీని ఆశిస్తోంది. 


అనంతపూర్ మరియు చిత్తూరు

అనంతపూర్ జిల్లా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ అ ఎప్పటినుండో కాంగ్రెస్ హవా కొనసాగుతుండగా గత ఎన్నికల్లో మాత్రం  తెదేపా కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్సిపి లను వెనక్కి నెట్టి మంచి ఆధిక్యతను సంపాదించింది. అనంతపురం లోక్‌సభ స్థానంలో జెసి దివాకర్ వెంకట్ రెడ్డి ని ఓడించి కలకలం సృష్టించారు. అయితే తర్వాత ఏర్పాటు దగ్గర అతని ప్రవర్తన చూసి అందరూ నివ్వెరపోయారు. అప్పట్లో అతని వైఖరి హెడ్ లైన్స్ లో కూడా నిలిచింది. ఇక చిత్తూరు జిల్లాలో మాత్రం మూడు పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంటుంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: