తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని సంచలన కామెంట్స్ చేసిన జగన్..!

KSK
కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల తేదీ ప్రకటించాక ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి గత ఎన్నికల మాదిరిగానే తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీల మధ్య పోటా పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి.


ఈ క్రమంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత మరియు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. రాష్ట్ర పౌరుల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థలకు ఇటీవల తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని వచ్చిన ఆరోపణల గురించి జగన్ మాట్లాడుతూ సైబర్ నేరానికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


డేటా చోరీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైబర్ నేరం చేశారని ఆయన అన్నారు. టీడీపీ యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్‌ సంస్థ డేటాను చోరీ చేయడంపై ప్రజల్లో చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల డేటాను ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి చంద్రబాబు ఎవరు అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.


ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసినందుకు టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాకినాడలో జరిగిన సమరశంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. ఇంకా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు గురించి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన అవినీతి గురించి ఈ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: