ఐదేళ్లలో పవన్ ఏం సాధించాడు ... ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాడా ..?

Prathap Kaluva

2019 ఎన్నికలకు సంభందించి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీలు ఒకటి అధికార పార్టీ అయినా టీడీపీ రెండు ప్రతి పక్ష పార్టీ అయినా వైసీపీ రెండు కూడా జనాల్లోకి బాగా చేరిన పార్టీలు అయితే , 2014 లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి టీడీపీ  బీజేపీ కూటమి కి మద్దతు ఇచ్చి వారి గెలుపు కు పరోక్షంగా కారణమయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జనసేన ఒంటరిగా భరిలోకి దిగబోతుంది. 


అయితే ఈ ఐదేళ్లల్లో పవన్ రెండు పార్టీల అధినేతలు అయినా చంద్ర బాబు .. జగన్ కు ప్రత్యామ్నాయంగా మారినాడా .. కొత్త రాజకీయాలు చేస్తానని చెబుతున్న పవన్ అటువంటి రాజకీయాలను జనాల్లోకి సరిగా తీసుకెళ్లగలిగినాడా ..?అయితే దీనికి సమాధానం కాదనే చెప్పాలి. పవన్ అభ్యర్థులను ఎంపిక చేసే విధానం ఒక కొత్త ఒరవడికి నాంది పలికిన,  అది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్లగలిగిందన్నది ఇక్కడ ప్రశ్న. ప్రజారాజ్యం తాలూకు పొరపాట్లను పవన్ .. జనసేన పార్టీలో చేయలేదు. కుటుంబ జోక్యాన్ని దూరం పెట్టాడు. 


అయితే పవన్ కళ్యాణ్ పార్టీ ని వేధిస్తున్న మరో సమస్య జనసేన పార్టీ కి అన్ని తానై వ్యవహరించడం .. పార్టీ తరుపున మాట్లాడే పెద్ద నాయకులూ లేకపోవటం. దీనితో ప్రజల్లోకి ఆ పార్టీ అంతగా రీచ్ కాలేకపోతుంది. ప్రతి విషయాన్ని స్వయంగా పవన్ ఖండించాల్సి వస్తుంది. అలాగే పవన్ పార్టీ కి క్షేత్ర స్థాయిలో బలం లేకపోవటం. బూతు స్థాయిలో కార్యకర్తలు ఉంటే ఏ పార్టీకైనా విజయావకాశాలు ఉంటాయి. మరి కొత్త రకం రాజకీయాలు చేయాలనుకుంటున్న పవన్ ను ప్రజలు ఏ మేరా అర్ధం చేసుకున్నారో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచి ఉండాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: