ఉమ్మడి రాజధాని వదిలేసి, తాత్కాలిక నిర్మాణాల వెంటపడేవారిపై చర్యలు లేవా? ప్రజలకు వివరణ ఇవ్వరా?

అర్ధరాత్రి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదిలేయటం మొత్తం దేశానికే నష్టం. తాత్కాలిక భవనాల అమరావతి ఈ  దేశాని కి ఎంత నష్టం చేసిందనే లెక్క నరెంద్ర మోడీ బయటకు తీయరా? ఎవరి శ్రేయస్సు కోసం ఈ  జాతి ఈ ఆర్ధిక, రాజకీయ, సామాజిక, ద్వని వాతావరణ కాలుష్యాన్ని, సమయ నష్టాన్ని భారత జాతి ముఖ్యంగా ఏపి, తెలంగాణా ప్రజలు భరించాలి? పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉండగా తాత్కాలిక నిర్మాణాలతో అమరావతిని నింపడమెందుకు?  పూర్తి అమరావతి నే నిర్మించి అప్పుడు తరలి వెళ్ళొచ్చుగదా! 


ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసి నిర్మాణానికి మాత్రమే ఒక్కో అడుగుకి ₹ 10000/- పైగా ఖర్చు చేశారనేది నిజమెనా? ఈ మొత్తం ప్రజలు కట్టిన పన్నుల నుండే గదా! ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది? అయితే ఈ నష్టం మొత్తం విలువ ప్రజలకు ఎవరు తిరిగి చెల్లిస్తారు? పది సంవత్సరాలపాటు హైదరాబాద్ రాజధానిని వినియోగించు కొంటూ నూతన రాజధాని అమరావతిలో ఒక్కో భవనాన్ని శాశ్విత ప్రాతిపదికపైనే నిర్మాణాన్ని పూర్తిచేసి ఉండేవాళ్లు. పోనీ తాత్కాలిక నిర్మాణాలు ఏమైనా తక్కువ ధర లతో నిర్మిస్తున్నారా! అంటే, ఆ రేట్లు సామాన్యమా? కాదు అసాధారణం.


ఈదంతా చూస్తుంటే ఈ అమరావతి ప్రజలకోసమా? గుత్తేదార్ల కోసమా? ప్రజలలో ప్రజ్వరిల్లే ఈ ప్రశ్నలే ప్రజల్లో నిద్రాణంగా ఉన్న ఙ్జానాన్ని ప్రజ్వలింపజేస్తుంది. ఆ జాగృతి రానున్న ఎన్నికల్లో నిశ్శబ్ధ బడబాగ్నిలా మారి ఒక్కసారి విస్పోటనమైతే చాలు! అన్నీ ప్రశ్నలకు సమాధానాలు వాటి కవే గడగడా బయటికి ప్రవహిస్తాయి.  

 

తాజాగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కు లక్షకోట్ల రూపాయలు ఇవ్వాలని ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లెక్కలు చెబుతున్నారు. మరి ఈ ఐదేళ్ళు ఆ ‘లక్ష కోట్ల’ మాటే అనలేదు ఎందుకు? రాజీపడి హైదరాబాద్ వదిలేసి వచ్చానని, కొన్ని ప్రభుత్వ సంస్థలను కూడా వదిలేసుకున్నామని చెప్పారు. వదిలేసుకోవటానికి అవి ఏమైనా చంద్రబాబు గారి కుటుంబానికే స్వంతమైన "హెరిటేజ్ సంస్థలా? ఆస్తులా?" - ఏపీ ప్రజలకు విభజన వలన సిద్ధించిన హక్కులు కదా! రానున్న సార్వత్రిక సాధారణ ఎన్నికల్లో గెలుపు కోసం నారా చంద్రబాబు నాయుడు "ఆ ముగ్గురు మోడీలు" పైనే భారం వేసినట్లు కన్పిస్తోంది.

నారా చంద్రబాబు నాయుడు నిరంతరం పఠించే మూడక్షరాల మంత్రం - "జాతీయ మోడీ నరేంద్ర మోడీ అని, తెలంగాణా మోడీ కేసిఆర్ అనీ, ఇక ఆయన ప్రత్యర్ధి ఏపి మోడీ వైఎస్ జగన్మోహనరెడ్డి" -  "త్రిమోడీ" అనే  త్రిమూర్తులే  ఆయనకు కళ్ళు తెరిచినా మూసినా కనిపిస్తారట.

ఉభయ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిని ఓటుకు నోటు కేసులో బ్రతుకుతూ చస్తూ వదిలేసిన నేఱగాడిని, ఈ ముగ్గురు మోడీలు ఏమీ చేయలేరా? దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా చర్య తీసుకోకపోతే జాతికి తీవ్ర నష్టం జరిగినట్లే!  

విభజన హక్కుల సాధన కమిటీ నాయకుడు చలసాని శ్రీనివాస్ గాని - ప్రత్యేక హోదా సాధనకోసం జీవితం అర్పిస్తానంటున్న సినీనటుడు గరుడ శివాజీ శోంటినేని ఏమీ మాట్లాడట్లేదు కారణం ఏమిటీ? జనం అనుకునే వీరిదీ నారా చంద్రబాబు నాయుడు గారిదీ ఒకే సామాజిక వర్గం  కావటమేనా?  



ఇది ప్రత్యేక హోదాతో సమానమైన ప్రయోజనం. హర్యాణా పంజాబ్ ఉమ్మడి రాజధాని పదేళ్ళుగా కొనసాగుతూనే ఉంది. అవసరమైతే హైదరాబాద్ ను కూడా ఉమ్మడి రాజధానిగా కొనసాగించొచ్చు. అది నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రజాద్రోహానికి కేసీఆర్ కు అరణంగా ఇచ్చివేశారు - జస్ట్ లైక్ ఈయన స్వంత హెరిటేజ్ శాఖ లాగా! అదైతే ఆయన అసలే వదలి ఉండేవారు కాదని - ప్రజల సొమ్ము కాబట్టి చంద్రబాబు అబ్బ సంపదలా హైదరాబాద్ ను వదిలేశారు.  లేకపోతే విశ్వనగరం అమరావతి ద్వారా నారా చంద్రబాబు నాయుడు అయన స్వసమాజం సంపదను చిరకాలం పితుక్కోవాలని అనుకున్నారా? 


ప్రతిపక్ష నాయకుల నేరారోపణలపై ఈకలు పీకి పెద్దగా మగ్నిఫైయింగ్ లెన్సులో బహు పెద్దగా చూపించే తెలుగు ప్రధాన మీడియాకు ఈ నారా చంద్రబాబు నేరం పట్టదా? ఈ ఉభయ రాష్ట్రాల ప్రజల అభిమానంతో ఎదిగిన ఈ మీడియా ప్రజలకు తిరిగి ఇవ్వాలని తెలియదా? ఋణం తీర్చుకోరా? ఒక్క మీ సామాజిక వర్గం ప్రత్యేకించి నారా సేవలలోనే తరించి పోతారా? 


ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఈ విషయంలో నింపాదిగా ఉన్నారు. ఐదుకోట్ల మంది ప్రశ్నించక పోయినా ప్రతి పక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎందుకు దీనిపై యుద్యమం నిర్మించలేదు? ప్రత్యేక హోదా అంటూ తనను నిరంతరం నిందించే అవమానించే ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుణ్ణి ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకోకుండా వదిలెయ్యటం ఎందుకు? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: