జైష్ టెర్రరిష్ట్ మసూద్‌ ను అప్పగించండి - ఇమ్రాన్‌ ఖాన్ కు సుష్మా స్వరాజ్ సవాల్!

మన విదేశీ వ్యవహారాల మంతి సుష్మ స్వరాజ్ ఎంత సున్నిత మనస్కురాలో అవసరమైతే అంతకు వ్యతిరేఖ దిశలో పదునైన పదజాలం వాడేసి ఎదుటివారెంత వారైనా తన సత్తా చూపిస్తారు. ఆ మాతల పదును పాకిస్తాన్ అధినేత ఇమ్రాన్ ఖాన్ రుచి చూశారీమద్య.  


"మసూద్‌ అజర్‌ ను అప్పగించకుండా శాంతి సందేశాలు వల్లించకండి" అంటూ ఇమ్రాన్ ఖాన్‌కు సుష్మా చురక లంటించారు. పాకిస్థాన్ తీరుపై మరోసారి మండిపడ్డారు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ నిజంగా ఇరుదేశాల మధ్య శాంతి ని కోరుకుంటే వెంటనే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ ను భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. 

మసూద్‌ ను అప్పగించ కుండా శాంతి సందేశాలు వల్లించకండి అంటూ ఇమ్రాన్ ఖాన్‌ కు సుష్మా స్వరాజ్ చురకలంటించారు. భారత్‌ తో పాకిస్థాన్ సత్సంబంధాలు కోరు కుంటే ప్రధానిగా ముందుగా మసూద్‌ ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు సుష్మా స్వరాజ్. ఇమ్రాన్‌ కు అంత పెద్ద మనుసుంటే, మసూద్‌ పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.


మరో వైపు ఇప్పటికే మసూద్ అజర్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాది గా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌ ను చైనా మరోసారి అడ్డు పుల్ల వేసింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాది గా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సభ్యదేశాలు పది పనిదినాల్లోగా లేవనెత్తాలి. దీనికి బుధవారంతో గడువు ముగిసింది.

చివరి నిమిషంలో సాంకేతిక కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదన పై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీగిపోయింది. మసూద్‌ అజహర్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాది గా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మరోవైపు సీఆర్పీఎఫ్ జవాన్ల పై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ లోని బాలాకోట్‌ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులుకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 200 నుంచి 300 ఉగ్రవాదు లు హతమైనట్లు కేంద్రం చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: