బొత్సతో బోణి?

 హైదరాబాద్: అస్తవ్యస్తంగా తయారైన రాష్ర్ట కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తొలుత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవీ నుంచి బొత్స సత్యనారాయణను తప్పించవచ్చనీ జోరుగా ప్రచారం జరుగుతోంది. జోడు పదవులను చూపెట్టి బొత్సను పీసీసీ పదవీ నుంచి తప్పించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీని వెనక బాగానే తతంగం నడిచినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనూహ్యా పరిస్థితుల్లో సీఎం సీటును అలంకరించిన కిరణ్ కూడా ఢిల్లీలో బాగానే చక్రం తింపుతున్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను కూడా ఊపేక్షించడానికి కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం ఇష్టపడటం లేదనీ సమాచారం. పీసీసీ అధ్యక్షుడు సత్తిబాబును తప్పించడంతో పాటు కళంకిత మంత్రులపై కూడా వేటు వేయాలనే నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల జాబితాలో పీసీసీ చీఫ్ బొత్స కూడా ఉన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో బొత్సపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ధర్మాన రాజీనామా వ్యవహారాన్ని చక్కదిద్దడానికి ఢిల్లీ వెళ్లిన బొత్సకు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల నుంచి ఊహించని షాక్ ఎదురైనట్లు తెలుస్తోంది. రాష్ర్ట పరిస్థితులపై చర్చించడానికి ఢిల్లీకి వెళ్లితే...తన పదవీ ఊడిపోతుందనీ బొత్స ఊహించి ఉండకపోవచ్చనీ పార్టీలో చర్చసాగుతోంది.  ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనా రాష్ర్టంలో పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపెడుతన్నట్లు వార్తలొస్తున్నాయి. తొలుత పీసీసీ చీఫ్ తోనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ధర్మాన రాజీనామాను కూడా అమోదించనున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రాష్ర్ట కాంగ్రెస్ పార్టీలో, సర్కార్ లో మరిన్ని మార్పులు చోటుచేసుకోవడం తథ్యమనీ తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: