కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేసిన మాయావతి..!

KSK
త్వరలో దేశమంతటా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాబోతున్న ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావటానికి బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ తమ ప్రయత్నాలు మొదలుపెట్టాయి.


ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా రాబోతున్న ఎన్నికలలో దేశంలో కూటమి ఏర్పాటు చేసి ప్రధాని పదవి చేపట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు, ఎస్పి,బిఎస్పిల కూటమి కి మద్య వివాదం తమాషాగా ఉంది.


కాంగ్రెస్ కు రెండు సీట్లు వదలివేసినట్లు ఆ కూమటి ప్రకటిస్తే,కాంగ్రెస్ ఈ కూటమి ప్రముఖులు ఏడుగురికి పోటీ పెట్టబోవడం లేదని,వాటిని వదలివేస్తున్నట్లు ప్రకటించింది.దీనిపై బిఎస్పి అదినేత్రి మాయావతి మండిపడ్డారు.


తమకు కాంగ్రస్ ఇచ్చే ముష్టి ఏడుసీట్లు అవసరం లేదని ఆమె అన్నారు.మీ (కాంగ్రెస్‌) నుంచి మాకు ఎలాంటి సహకారం అవసరంలేదని, మొత్తం 80 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేసుకోవచ్చని మాయావతి సూచించింది. ‘‘యూపీలోనే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా తమకు కాంగ్రెస్‌-బీఎస్పీ పొత్తు లేదు. వారి అసత్య ప్రచారాన్ని నమ్మకండి’’ అని ఆమె స్పష్టం చేశారు. దీంతో మాయావతి చేసిన కామెంట్లు ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: