బ్రాహ్మణ పక్షపాతి వైఎస్ జగన్!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో అర్ధికంగా, రాజకీయంగా అట్టడుగున ఉన్న బ్రాహ్మణుల పట్ల రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయి..ఈ పరిస్థితులలో మానసికంగా నలిగిపోతున్న బ్రాహ్మణ జాతికి ఆశాకిరణంలా మళ్లీ వారికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మాటలు కాకుండా చేతల ద్వారా చూపిన నాయకుడు , రాజన్న వారసుడు జగనన్న ....

చంద్రబాబు నాయకత్వంలో ని టీడీపీ ప్రభుత్వం బ్రాహ్మణులను కూరలో కరివేపాకులా వాడుకోవడంతో పాటు దేవాలయాలను కూలగొట్టడం, అర్చకుల కడుపుకొట్టిన సంగతి మనం ఐదు సంవత్సరాల కాలంలో చూస్తుఉన్నాం... రాజ్యాధికారం లేకపోవడం వలనే మనకి ఈదుస్ధితి.       ఇటువంటి సమయంలో వైఎస్ ఆర్ పార్టీస్ధాపించిమొదటినుండిబ్రాహ్మణులకు మేలు చేసే విధంగాతనకార్యక్రమాలు నిర్వహించిన వైఎస్ జగన్ .... చేతల్లో బ్రాహ్మణులకు టికెట్లిచ్చి మన జీవితాలకు “ నేను విన్నాను-నేను ఉన్నాను” అంటూ నిరూపించారు . మనకు సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చిన మూడు నియోజకవర్గాలు ఎంత కీలకమైనవో.... వీటిని మన వర్గాలకు కేటాయించడానికి జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం. 


సోదరులారా... విజయవాడ సెంట్రల్ మల్లాది విఘ్ణకి కేటాయించారు జగన్ . ఇక్కడమొదటినుండిపనిచేసింది .వంగవీటి రాధ...మన సామాజిక వర్గమైన విఘ్ణ అన్న కోసం రంగా కుమారుడు , బలమైన సామాజిక వర్గమైన రాధ ను కూడా ప్రక్కకు పెట్టి మన బ్రాహ్మణ సోదరుడికి కేటాయించడం జగన్ గారు వల్ల సాధ్యమైంది. బాపట్ల లో మన ఎమ్మెల్యే కోన రఘపతికి టికెట్ ఇవ్వవద్దని... జగన్ గారుసామాజికవర్గంఎన్నిఆటంకాలు ,ఆందోళనలు చేసిన ఇచ్చిన మాట తప్పని జగనన్న కోన కి జై కొట్టారు . 32 వేల ఒక సామాజిక వర్గం వ్యతిరేకించినా నేను ఉన్నా ..కోనన్న అంటూ మాట మీద నిలబడ్డారు రాజన్న కుమారుడు జగనన్న.
     
నిన్న పార్టీలో చేరిన ద్రోణంరాజు శ్రీనన్నకు వెంటనే టికెట్ ఖరారు చేసిన మొనగాడు జగన్  విశాఖ సౌత్ నుండి బీసీ అభ్యర్దలను కాదని బ్రహ్మణులకే ఈ  స్ధానం ఇస్తానని చెప్పి ఆచరణలో చూపించిన నేత జగన్ .  సోదరులారా ...! ఒక్కసారి ఆలోచించండి మనకోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకొన్న వైసీపీ అధినేత జగన్ అన్న ను గెలిపిద్దాం...ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి బ్రహ్మణుల ఐకమత్యాన్ని చాటుదాం...


జగన్ అన్న నువ్వు ఒంటరి కాదు -
బ్రాహ్మణ జాతి వేద మంత్రమై నిన్ను ఆశీర్వదిస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: