హిందూపూర్ వైసీపీ అభ్యర్థిని.. టీడీపీ హీరోగా మార్చేసిందిగా..?

Chakravarthi Kalyan
అధికారం చేతిలో ఉందని.. అడ్డమైన ఎత్తులు వేస్తే.. అవి ఒక్కోసారి బెడిసికొడతాయి. హిందూపూర్ లోక్ సభ నియోజకవర్గ వైఎస్ ఆర్ కాంగ్రెస్ క్యాండిడేట్ విషయంలో అలాగే జరిగింది. ఇక్కడ  సిఐ గా ఉన్న గోరంట్ల మాదవ్ వైసీపీ తరపున బరిలో దిగారు. 


రాజకీయాల్లో రావాలని నిర్ణయించుకుని గత డిసెంబర్‌లోనే స్వచ్ఛంద విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ సర్కారు పెద్దల ఒత్తిడితో దాన్ని అమోదించకుండా పక్కన పెట్టారు. ఇప్పుడు అది గోరంట్ల మాధవ్ అభ్యర్థిత్వానికి ఇబ్బందిగా మారింది. 


ఒక దశలో హిందూపూర్ అభ్యర్థిని వైసీపీ మార్చాలేమో అన్నంతగా వార్తలు వచ్చాయి. కానీ ఈ అంశంపై ఆయన న్యాయపోరాటం చేశారు. నామినేషన్లు ముగిసే గడువు దగ్గరపడుతున్నా, వలంటరీ రిటైర్ మెంట్ ను ఆమోదించకపోవడంతో ఆయన ట్రిబ్యునల్ కు వెళ్లారు. 



ఈ కేసు విచారించిన ట్రిబ్యునల్ వెంటనే విఆర్ఎస్ ను ఆమోదించాలని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వలంటరీ రిటైర్ మెంట్ ను ఆమోదించకుండా ఉంచడం సరికాదని ట్రిబ్యునల్ పేర్కొంది. దీంతో టీడీపీ కుట్రలు బట్టబయలై గోరంట్ల మాధవ్ హీరోగా మారారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: