అప్పుడే వివాదసుడిలో ప్రియాంక గాంధి

సాంప్రదాయం సంస్కృతి తెలియదనుకోవాలో, ప్రధాని అంటే గాంధి నెహృ కుటుంబ సభ్యులను కుంటారో తెలియదు కాని అవకాశం దొరికితే గాంధి నెహృ కుటుంబేతర కాంగ్రెస్ ప్రధానులను అవకాశం చిక్కినప్పుడలా అవమానించటం గాంధి నెహృ కుటుంబీకులకు అలవాటే. అదే అలవాటు పునఃరావృతమైంది. ఇది యాదృచ్చికమా లేక కావాలని చేసిందా అనేది సంశయాస్పధమే. కాంగ్రెస్ ప్రధానుల్లో ఈ దేశానికి మేలు చేసిన అగ్రగణ్యుడు తెలుగువారు పివి నరసింహారావు స్మృతిచిహ్నం డిల్లీలో లేకుండా చేయటమే కాదు ఆయన అంత్యక్రియలు సాంప్రదాయంగా నిర్వహించలేదు. 

తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. గంగానదిలో మూడురోజులపాటు బోటులో ప్రయాగ్ రాజ్ నుండి వారణాసి వరకు జలయానం చేసి, కాంగ్రెస్ కోసం ప్రచారం నిర్వహించిన ఆమె, ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలో ఈ మూడురోజుల యాత్ర ముగించారు. ఈ సందర్భం గా ఆమె తను మెడలో ధరించిన ఒక పూలదండను తీసి, అక్కడే ఉన్న దివంగత మాజీ ప్రధాని జై కిసాన్ జై జవాన్ స్పూర్తి ప్రధాత  లాల్‌ బహదూర్‌ శాస్త్రి విగ్రహం మెడ లో వేశారు. మహనీయ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తరవాత వెంటనే ప్రియాంక నాయనమ్మ ఇందిరా గాంధి ఆఘమేఘాల మీద భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణంలో ఏదో కుట్ర దాగి ఉందనే వారు చాలామందే ఉన్నారు. 

ఈ విషయాన్ని వెంటనే గమనించిన బీజేపీ, ప్రియాంక గాంధి తన మెడలో అప్పటికే ధరించిన పూలహరాన్ని మహనీయ లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి వేసి అపచారం చేశారని ఆయనను అవమానించారంటూ, విమర్శల దాడికి దిగింది. నిజమే కదా మది. అది పొరపాటా? గాంధి నెహౄ డైనాస్టీ అహంకారమా? అని అంతర్జాలంలో నెటిజెన్స్ గగ్గోలు పెడుతున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, ప్రియాంక గాంధిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఒక సారి ధరించిగా మలిన మైన  పూలహారాన్ని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి వేసి, ప్రియాంక గాంధి ఆయనను అవమానించారని, ఆమె అహంకారానికి ఇది నిదర్శనమని స్మృతి ఇరానీ మండి పడ్డారు. బీజేపీ శ్రేణులు కూడా ఈ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూ, విమర్శలు గుప్పిస్తున్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్‌-చార్జిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధి ప్రజలతో మమేకం అయ్యేందుకు, వారితో మాట్లాడేందుకు గంగానదిలో చేపట్టిన పడవ యాత్ర ఇలా అపచారంతో ముగించారు నిన్న బుధవారం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: