ఎడిటోరియల్ : ప్రత్యర్ధులను ఒంటరిగా ఎదుర్కోలేరా ? పవన్ అండ

Vijaya

అవును గడచిన నలబై ఏళ్ళ రాజకీయంలో ఏ ఘటన చూసినా ఇదే విషయాన్ని నిరూపిస్తుంది. ప్రత్యర్ధి ఎవరైనా సరే నేరుగా ఢీ కొనే శక్తి,, అలవాటు చంద్రబాబునాయుడుకు ఏనాడు లేవన్న విషయం అందరికీ తెలిసిందే. సమస్య ఎప్పుడు వచ్చినా సరే పారిపోవటం లేదా ఎవరినో బలిచేసి తాను బయటపడటం తప్ప ఏనాడు ధైర్యంగా ఎదుర్కొన్నది లేదు. చరిత్రలో ఎప్పుడో జరిగింది జనాలు మరచిపోయుండచ్చు.  1994  ఎన్నికల నుండి జరిగిన ఘటనలు తీసుకుంటే చాలు చాలా మందికి అర్ధమైపోతోంది.

 

1994లో అఖండ మెజారిటీతో గెలిచిన ఎన్టీయార్ ను గద్దె దింపటం కోసం లక్ష్మీపార్వతిని అడ్డంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసి ఎన్టీయార్ కుటుంబసభ్యులను మ్యానేజ్ చేసుకున్నారు. చివరగా లక్ష్మీపార్వతిని సాకుగా చూపి ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి సిఎం అయ్యారు. తర్వాత 1999లో కార్గిల్ వార్ సందర్భంగా దేశవ్యాప్తంగా కార్గిల్ వార్ తర్వాత హవాను గమనించి వామపక్షాలను వదిలేసి బిజెపితో పొత్తు పెట్టుకుని అధికారాన్ని నిలుపుకున్నారు.

 

సరే 2003 వచ్చేసరికి చంద్రబాబు చాణుక్యం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ముందు పారలేదు. టిఆర్ఎస్, వామపక్షాలతో కలిసినా వైఎస్ దెబ్బకు 10 ఏళ్ళ పాటు ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సొచ్చింది. ఏదో చంద్రబాబు అదృష్టం కొద్దీ రెండోసారి సిఎం కాగానే  వైఎస్ స్వర్గస్తుడయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రయ్యే పరిస్ధితి నిజానికి లేదనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు అప్పుడు కూడా చంద్రబాబు కుదేలైపోయున్నారు.

 

ఒంటరిగా జగన్ ను ఎదుర్కొనే ధైర్యం లేక నరేంద్రమోడి, పవన్ కల్యాణ్ ను అడ్డం పెట్టుకున్నారు. వాళ్ళ మద్దతు కూడా సరిపోదనుకున్నారు. అందుకనే ఆచరణ సాధ్యం కానీ వందలాది హామీలిచ్చి మొత్తానికి  సిఎం అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత సిఎం అయిన చంద్రబాబు ఏపిని బావుచేసుకునే విషయంపై దృష్టి పెట్టకుండా కెసియార్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్లాన్ చేసి ఓటుకునోటు కేసులో దొరికిపోయారు. దాంతో అరెస్టు నుండి తప్పించుకునేందుకు విజయవాడకు పారిపోయొచ్చారు.

 

తాజా ఎన్నికల్లో చంద్రబాబులో టెన్షన్ పీక్ స్టేజికి చేరుకుంటోంది. ఎందుకంటే, అన్నీ వైపుల నుండి కమ్ముకుంటున్న సమస్యలు చాలవన్నట్లు డేటా చోరీ స్కాం బయటపడింది. ఈ స్కాంలో చంద్రబాబు, చినబాబు ఇద్దరూ పూర్తిగా ఇరుక్కుపోయారు. అందులో నుండి ఎలా బయటపడాలో అర్ధంకాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సరే చంద్రబాబు ప్రత్యర్ధులపై ఎంత మాట్లాడుతున్నా నిజాలేంటి జనాలకు ఈపాటికే అర్ధమైంది. అందుకే ఎవరేమనుకున్నా పర్వాలేదనే పవన్ కల్యాణ్ ను అండగా తెచ్చుకుంటున్నారు. మరి జనాలేం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: