వైసీపీ గూటికి ఎస్వీ మోహన్ రెడ్డి..!

KSK
2014 ఎన్నికలలో వైసీపీ పార్టీ గుర్తుపై గెలిచి జగన్ ని మోసం చేసి ఫిరాయించిన నేతలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నట్లు ప్రస్తుత పరిస్థితులు బట్టి తెలుస్తోంది. గత ఎన్నికలలో కర్నూలు జిల్లాకు చెందిన ఎస్వీ మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుపై గెలిచి అధికార పార్టీ టీడీపీలోకి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఫిరాయింపు నేతలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.


మొన్న బుట్టా రేణుక కు తాజాగా మోహన్ రెడ్డి కి టికెట్ కేటాయింపు విషయంలో మొండి చేయి చూపించిన నేపథ్యంలో..ఇప్పటికే బుట్టా రేణుక వైసీపీ గూటికి చేరారు. ఈ క్రమంలో ఎస్వీ మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు మళ్లీ వెనక్కి రావాలని నిర్ణయించారు.


నాలుగేళ్ల పాటు టీడీపీ కోసం పనిచేస్తే, చివరి నిమిషంలో తమకు టికెట్ ఇవ్వకుండా టీడీపీ మోసం చేసిందని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. నెల రోజుల క్రితం వరకు సర్వేలు అన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి.. ఇప్పుడు టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.


కేవలం డబ్బు ప్రభావంతో తమకు టికెట్ కేటాయించలేదని ఆరోపించారు. గతంలో సాక్షాత్తూ లోకేష్ తన పేరు, రేణుకమ్మ పేర్లను ప్రకటించారని, ఇప్పుడు ఇద్దరికీ టికెట్లు రాలేదని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. 2009 ఎన్నికల్లో కూడా టీడీపీ ఆఖరి నిమిషంలో అన్యాయంచేసిందని ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరి తాను పొరపాటు చేశానని, తప్పు సరిదిద్దుకోవడానికి తాను మళ్లీ వైసీపీలో చేరతానని ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: