ఏం మాట్లాడుతున్నావ్ పవన్ : బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయగలడు ?

Prathap Kaluva

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపటమే కాకుండా పవన్ కళ్యాణ్ టీడీపీకి లొంగిపోయాడా అని అనుమానాలు రాకమానదు. పవన్ మాట్లాడుతూ బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయలేకపోయాడని మరీ రాష్ట్రాన్ని ఏం కాపాడతాడని అన్నాడు. ఇందులో ఎంత రాజకీయ అజ్ఞానం లేదా టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నాడో తెలియడం లేదు కానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఏం చేయగలడు. నిస్సహాయంగా న్యాయం చేయాలనీ అడగటం తప్పితే. 


ఇదే విషయం తటస్థుల మనస్సులో మెదలాడుతుంది. ఎలాగూ ఇటువంటి మాటలు టీడీపీ శ్రేణులకు మరియు జనసేన అభిమానులకు నచ్చుతాయి. కానీ సాధారణ ప్రజలు, తటస్థంగా ఉండే వ్యక్తులు జగన్ ఏం చేయగలడని ఆలోచించగలడు. అయితే పవన్ ఎదో జగన్ ను విమర్సించాలని విమర్శిస్తే మాత్రం పవన్ కు ఉన్న ఆ ఇమేజ్ కూడా దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే పవన్ మరియు చంద్రబాబు తెర వెనుక కలిసిపోయారని చాలా మంది ఆరోపిస్తున్నారు. 


దానికి కారణాలు లేకపోలేదు. ఎప్పడూ పవన్ కళ్యాణ్ స్పీచ్ కు ప్రాముఖ్యత ఇవ్వని ఈనాడు ఏకంగా రెండు పేజీలు నిండా పవన్ ఇంటర్వ్యూ ను కవర్ చేసింది. ఆ ఇంటర్వ్యూ లో చంద్రబాబు ను సైడ్ లైన్ చేస్తూ జగన్ ను విమర్శించడం ఎలా మర్చిపోగలం. అలాగే జగన్ తనది ఒక పార్టీ అని కూడా గుర్తించడం లేదని వ్యాఖ్యానించడం దేనికి నిదర్శనం. ఇవన్నీ జగన్ ను టార్గెట్ చేయటం కాదా అని వైసీపి శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే విమర్శలు చేయొచ్చు కానీ దానికి ఒక అర్ధం పర్ధం ఉంటేనే ప్రజలు స్వాగతిస్తారు. లేదంటే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవటం తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: