బీసీలను క్షోభ పెడుతున్న తెలుగుదేశం పార్టీ...!

Chakravarthi Kalyan
తెలుగుదేశం పార్టీ.. బీసీలకు పెట్టని కోటగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు పేరు ఉండేది. తెలుగుదేశం పుట్టకముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ సమాజంలోని కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేది.. అప్పట్లో మిగిలిన పార్టీలూ అంతే.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను పట్టించుకున్నారు కానీ బీసీలకు అండగా నిలవలేదు. 



సమాజంలో సగభాగం జనాభా ఉన్నా బీసీలకు తెలుగుదేశం రాక ముందు అన్యాయమే జరిగింది. ఈ సమయంలో వచ్చిన తెలుగుదేశం పార్టీ బీసీల గొంతుకగా మారింది. ఎన్టీఆర్ హయాంలో ఎందరో బీసీ నేతలు అగ్రనేతలుగా వెలుగొందారు. అది ఎన్టీఆర్ నాయకత్వ పుణ్యం. 



కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీలను క్షోభపెడుతోంది. చంద్రబాబు చుట్టూ చేరిన ఓ సామాజిక వర్గ కోటరీ బీసీలకు అన్యాయం చేస్తోంది. బీసీల్లో ఎవరైనా బలమైన నాయకుడిగా కనిపిస్తున్నా అణగదొక్కే చర్యలు మొదలయ్యాయి. ఇందుకు గోరంట్ల మాధవ్ ఓ ఉదాహరణ. 



సీఐగా పని చేస్తూ జగన్ పిలుపుతో రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన బడుగు వర్గాల వ్యక్తి గోరంట్ల మాధవ్. ధైర్యసాహసాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఇతన్ని కనీసం పోటీలోనే లేకుండా చేయాలని టీడీపీ ప్రయత్నించింది. నిబంధనల పేరుతో అడ్డుకోవాలని ప్రయత్నించింది. చివరకు గోరంట్ల మాధవ్ న్యాయపోరాటంలో గెలిచారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: