పులివెందుల నుంచి గూండాలు వస్తారా ... ప్రజలను రెచ్చకొట్టడం నీ రాజకీయమా పవన్ ..!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం కోసం చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలో ఆంధ్ర ప్రజలను కొడుతున్నారని లేనిపోని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పులివెందుల గూండాలు అంటూ రాయలసీమ ప్రజలను అవమానిస్తున్నారు. నిందలు వేయడం హీరోయిజం కాదు... వ్యక్తిగతంగా సినీ హీరో అయిన పవన్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హీరోయిజం అంటే ఇతరులపై నిందలు వేయడంకాదు. తనవారికి , తనచుట్టూ ఉన్నవారికి మేలు చేసి అభిమానం పొందడం. కానీ పవన్ అందుకు భిన్నంగా జగన్ మీదా రాయలసీమ ప్రజల మీదా నిందలు వేయడం ద్వారా విజయం సాధించాలనుకుంటున్నారు.


2014లో తన మద్దతుతో అధికారంలోకి వచ్చిన బాబు ప్రభుత్వంతో దాదాపు నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నపుడు భీమవరంకి ఏమిచేసినారు, విడిపోయిన తర్వాత ఏ సమస్య పరిష్కారానికి పోరాటం చేసినారు, తనను గెలిపిస్తే భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఏమిచేస్తారు చెప్పి అక్కడ ప్రజల మద్దతు పొందవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ సంబంధం లేని పులివెందుల ప్రజలపై నిందలు వేసి రాజకీయం చేయాలనుకుంటున్నారు అంటే ఇతరుల మీద నెపం మోపి తాను హీరో కావాలనుకుంటే అంతకన్నా దుర్మార్గం మరోటి ఉండదు.


తనకు, తన కుటుంబానికి పెద్దదిక్కు అయిన మెగాస్టార్ చిరంజీవిని మీ స్వంత ప్రాంతం ప్రజలు ఓడిస్తే రాయలసీమ ప్రజలు తిరుపతి నుంచి గెలిపించి మీకు రాజకీయ బిచ్చపెట్టారు. అలాంటి ప్రాంతంపైనా మీరు నిందలు వేసేది. జగన్ రాజకీయాలుపై ఏ విమర్శలు చేసినా మాకు అభ్యంతరం లేదు. జగన్ పై కోపంతో వారు పుట్టిన రాయలసీమ ప్రజలపై నిందలు వేయడాన్ని సీమ సమాజం అంగీకరించదు. తమకు ఏమిచేశారు, ఏమి చేయబోతున్నారో చెప్పకుండా రాయలసీమ ప్రజలపై విషంచిమ్మితే విజ్ణత కలిగిన భీమవరం ప్రజలు కూడా హర్షించరు అని రాయలసీమ మేధావుల ఫోరం హెచ్చరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: