ఏపిలో ఓట్లకోసం హైదరాబాద్ లో ఆంధ్రావాళ్ళను కొడుతున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య: పోసాని

ఉభయ తెలుగు రాష్ట్రాల అభిమాన నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడే ఒక విద్యార్ధిగా ఆ తరవాత ఒక గొప్ప నటుడుగా ఎదిగారు. ఆయన సినిమాలను రోజుకు ఆరు షోలు వేసుకోవటానికి తెలంగాణా ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళి అనుమతి పొందారు ఈ గ్రేట్ పవన్ కళ్యాణ్. అలా తెలంగాణాలో మమేకమై జీవించారు పవన్ ఎవరూ ఆయన్ను ఇబ్బంది పెట్టిన సన్నివేశాలు మాకు తెలియదు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎలాంటి వారో అభిమానులకు ఆరాధ్యదైవం. కాని తాజాగా ఆయన ఆంధ్రాలో జనసేన పతాకంపై ఎన్నికల్లో పోటీ చేస్తూ ఈ స్థాయికి దిగజారారా? అనేది నేటి ప్రధాన ప్రశ్న. 

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సభలో జనసేన అధినేత పవన్‌ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలపై  సినీ నటుడు పోసాని కృష్ణమురళి మండి పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఓట్ల కోసం హైదరాబాద్‌ లో ఆంధ్రావాళ్లను కొడుతున్నారంటూ పవన్‌ వ్యాఖ్యానించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ లో పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ లో దెబ్బలు తిని ఆంధ్రాకు పారిపోయిన వాళ్లను చూపించాలని పవన్‌ కళ్యాణ్ ను నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం పై పవన్‌  కళ్యాన్ చేసిన వ్యాఖ్యలు సరి కాదని ఆంధ్రావాళ్ల ని ఎవరు కొట్టారో, ఎవరు ఆంధ్రాకు పారిపోయారో రుజువులు చూపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాను కూడా హైదరాబాద్‌ లోనే బతుకుతున్నా నని పవన్‌ రుజువులు చూపిస్తే తాను కూడా పారిపోయి ఆంధ్రాకు వస్తానని చెప్పారు. కేసీఆర్‌ ఎవరి భూములు లాక్కుంటున్నారో పవన్‌ కల్యాణ్ చెప్పాలని నిలదీశారు.

"నేను 1984 నుంచి హైదరాబాద్‌ లో ఉంటున్నా, తెలంగాణ మొత్తం తిరిగాను తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ను విమర్శిస్తూ వ్యాసాలు రాసాను. అయితే ఏ ఒక్క తెలంగాణ బిడ్డ నన్ను కొట్ట లేదు. నా ఇంటర్వ్యూ చూసి కేసీఆర్‌ కూడా లైట్‌ తీసుకున్నారు’ అని పోసాని కృష్ణమురళి తెలిపారు. తెలుగువాళ్ల మధ్య ఎందుకు విద్వేషాలు రెచ్చగొడతారు? అని పవన్‌ కళ్యాణ్ ను ప్రశ్నించారు. ఇదే పవన్‌ కళ్యాణ్ గతంలో కేసీఆర్‌ ను ఆంధ్రా నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని పొగిడారని గుర్తుచేశారు. ఆంధ్రా లో ఓట్ల కోసం ఇప్పుడు మాటమారుస్తావా? అంటూ పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: