ఎడిటోరియల్ : పెరిగిపోతున్న పవన్ సెల్ఫ్ గోల్స్..రివర్సవుతున్న కాపులు

Vijaya

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేసుకుంటున్న సెల్ప్ గోల్సు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యమంత్రయిపోవాలన్న ఆతృతో లేకపోతే చంద్రబాబునాయుడుకు రక్షగా నిలవాలన్నా తాపత్రయమో తెలీయటం లేదు. మొత్తానికి ప్రతీ విషయానికి జగన్ ను టార్గెట్ చేస్తుండటం, అదే సమయంలో కెసియార్ ను పిక్చర్లోకి లాగుతుండటంతో పవన్ నవ్వుల పాలవుతున్నారు.

   

గడచిన మూడు రోజుల్లో పవన్ వేసుకున్న ఇటువంటి సెల్ఫ్ గోల్సును చూద్దాం. భీమవరంలో నామినేషన్ వేసిన సందర్భంగా మాట్లాడుతూ, పులివెందుల కిరాయి మూకలను తెస్తే ఊరుకునేది లేదని జగన్ హెచ్చరించారు.  తాను నామినేషన్ వేయటానికి పులివెందుల కిరాయి మనుషులంటూ జగన్ కు వార్నింగ్ ఇవ్వటానికి ఏమన్నా సంబంధం ఉందా ? జనాలు ఓట్లేస్తే పవన్ గెలుస్తారు లేకపోతే ఓడిపోతారు. అంతదానికి పులివెందుల ప్రస్తావనెందుకు ?

 

ఇక గాజువాకలో మాట్లాడుతూ తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినా జగన్ చేతకాని వాడిలా చూస్తున్నాడు అంటూ మండిపడ్డారు. బాబాయ్ హత్య జరిగితే జగన్ ఏం చేస్తాడు ? అధికారంలో ఉన్నది చంద్రబాబే కదా ? ఏదో ఒకటి చేసే అవకాశం చంద్రబాబుకే కదా ఉండేది. అంటే ఎవరైనా రెచ్చిపోతే ఇదిగో పులివెందుల గూండాలు రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారని  జగన్ ను బూచిగా చూపాలన్నదే పవన్ దురాలోచనా ?

 

ఇక తెలంగాణాలో ఏపి వాళ్ళపై దాడులు చేస్తున్నారనే లేని కథను సృష్టించి నవ్వులపాలయ్యారు. తెలంగాణాలో ఎక్కడ కూడా ఏపి వాళ్ళపై దాడులు జరగలేదు. హైదారాబాద్ లో చాలామంది రాజకీయ నేతలకు, పారిశ్రామిక వేత్తలకు, సినీ సెలబ్రిటీలకు భారీగా ఆస్తులున్నాయి. ఏనాడు ఎవరిపైనా దాడులు జరగలేదు. ఆ విషయం పవన్ కు కూడా బాగా తెలుసు. అయినా ఎందుకన్నారంటే చంద్రబాబు చెప్పారు కాబట్టే పవన్ అన్నట్లు అందరికీ తెలిసిపోయింది. ఇపుడు కెసియార్, జగన్ లను చంద్రబాబు విమర్శిస్తున్నారు కాబట్టే పవన్ కూడా అదే రాగం మొదలుపెట్టారు.

 

చివరగా జనేసేన తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధులను చంద్రబాబే ఎంపిక చేస్తున్నట్లు అందరికీ అర్ధమైపోయింది. చివరినిముషంలో నర్సాపురం ఎంపి, విజయవాడ లోక్ సభ అభ్యర్ధులను మార్చటం, బిఎస్పీ మాయావతితో జనసేన పొత్తు మొత్తం చంద్రబాబు స్కెచ్ ప్రకారమే జరుగుతోందని అర్ధమైపోతోంది. దాంతో చంద్రబాబును రక్షించటం సంగతి తరువాత ముందు తాను పది సీట్లైనా గెలుస్తారా అన్నది డౌటుగా మారింది. ఎందుకేంట, చంద్రబాబును సమర్ధిస్తుండటంతో కాపునేతలే ఇపుడు పవన్ పై మండిపోతున్నారట. తాను నమ్ముకున్న కాపులు కూడా జనసేనకు దూరమైతే అది పవన్ వేసుకున్న సెల్ఫ్ గోలే కారణమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: