కేయే పాల్.. నవ్వుల పాల్...!!

Satya
ఏపీ రాజకీయం భలే చిత్రంగా ఉంటోంది. ఇక్కడ లేని ఎంటర్టైన్మెంట్ లేదు. పంచు డైలాగులు, యాక్షన్ సీన్లు, కామెడీ స్కిట్స్ ఒకటేంటి అన్నీ ఏపీ ఎన్నికల్లోనే ఉన్నాయి. ఏపీలో ఉన్న సీట్లు 175 అయితే 200 పైగా గెలుస్తామని ఓకాయన అంటాడు. ఓ అసెంబ్లీ సీట్లో రెండున్నర లక్షల ఓట్లు ఉంటే అయిదు లక్షల మెజారిటీతో గెలుస్తామని సూపర్ కామెడీ పండిస్తారు. సీఎం నేనే అంటూ రాసుకోమంటూ రెడీ అయిపోతున్న వారూ ఉన్నారు. మొత్తానికి ఇంత రంజుగా ఏపీలో ఎన్నికలు ఎపుడూ జరగలేదు.


ఇదిలా ఉండగా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేయే పాల్ ఈ మధ్య టీవీ షోలలో చేస్తున్న కామెడీ అంతా ఇంతా కాదు ఏకంగా మొత్తానికి మొత్తం సీట్లు తనవేనని పాల్ కడు ధీమాగా చెబుపూ వచ్చారు. తానే సీఎం అని కూడా అనేశారు. మరి సీఎం కావాలంటే పోటీ చేయాలి కదా. నామినేషన్  వేయాలి కదా. మరి వారం రోజులకు పైగా టైం ఇచ్చినా మన పాల్ గారికి వీలు కుదరనట్లుంది. దీంతో లేట్ గా వచ్చిన పాల్ సకాలంలో నామినేషన్ వేయలేదు.


భీమవరంలో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై పోటీచేస్తానంటూ ప్రచారం చేసిన పాల్ టైమ్ ముగిసిన తర్వాత నామినేషన్ ఇవ్వడానికి రాగా అధికారులు అనుమతించలేదు.అయితే కావాలని అదికారులు అంగీకరించలేదని,అన్నారు.అంతేకాక పనిలో పని గా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని కూడా ఆయన చెప్పేశారు. తాను భీమవరంలో పోటీ చేస్తున్నాననంటే పవన్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. యధా ప్రకారం పిచ్చి హామీలను ఆయన చెప్పుకుంటూ పోయారు.అయితే కావాలనే ఈయన ఆలస్యంగా వచ్చారా అన్న డౌట్ కూడా ఉంది. మొత్తానికి పాల్ నవ్వుల పాల్ అయ్యారని సోషల్ మీడియాలో ఒకటే జోకులు పేలుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: