సిఎం లు బ్రోకర్లా? ఐటీ, సిబీఐ, ఈడి అంటే వణికి పోవటం ఎందుకు? కుమారస్వామి గొంతు కలిపారు

అసలు దేశంలో ఐటీ దాడులకు స్వయాన వివిధరాష్ట్రాల ముఖ్యమంత్రులు చలించి పోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.  ఏందుకు ఐటీ దాడులు జరగకూడదో? తెలియడం లేదు. ఒకవేళ బిజెపి ప్రభుత్వం ఐటీ దాడులు, బిజేపి యేతర పక్షాలపై చేయిస్తే, దానికైనా ముఖ్యమంత్రులు ఎందుకు వణికిపోతున్నారు? పన్నుఎగవేత లాంటి తప్పుడు పని, నేఱం చేస్తేనే, కదా! ఆదాయ పన్నుశాఖ చర్యలు తీసుకునేది.


బిజేపి యేతర ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే, బిజేపి వాళ్ల పని బిజేపి యేతర ప్రభుత్వాలు పట్టాలి. అప్పుడైనా వారి నేరం ఋజువైతేనే కదా! చర్యలు తీసుకునేది. భిజేపి పాలనలో, బీజేపి యేతర పక్షాల్లో, ఉన్న ఆర్ధిక నేరగాళ్ళు, బిజేపి యేతర ప్రభుత్వాల పాలనలో బిజేపి పక్షం నేఱగాళ్ళు పట్టుబడితే కూడా మంచిదే కదా!


కర్ణాటకలో దీపం ఉండగానే ఇల్లు సర్ధుకునే పని కొందరు అధికారంలో ఉన్నవారు మొదలెట్టారట. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు రేవణ్ణ అనుచరణం. వారి ఇళ్లలో నేడు (గురువారం) ఆదాయపన్నుశాఖ దాడులు నిర్వహించారు. రేవణ్ణ గౌడ నిర్వహించే పబ్లిక్ వర్క్స్ శాఖలో అవినీతి తాండవిస్తుందని, అధికారం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో ఆ శాఖలోని మంత్రుల అనుచరులు, అధికారులు, క్రింది స్థాయి ఉద్యోగులు దొరికిన కాడికి దోచేసుకుంటున్నారని గుర్తించినట్లు పన్ను ఎగవేత ఓ స్థాయిలో ఉందని ప్రచారంలో ఉండటం  అనేక పిర్యాదులు ఐటీ శాఖకు అందటంతో తాము సోదాలు చేస్తున్నట్లు ఐటి అధికారులు చెపుతుండగా ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తుంది.

 

కాంగ్రెస్‌-జేడీఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఐటీ సోదాలు జరిగే అవకాశముందని కర్ణాటక ముఖ్య మంత్రి కుమారస్వామి బుధవారం సంచలన ఆరోపణలు చేశారట.  ప్రజాప్రతినిధుల పైనే దాడులు జరిగితే స్పందించే వీరు, మరి సాధారణ వ్యక్తులపై జరిగే దాడులకు స్పందించరా? అధికారంలో ఉండేవాళ్ళు ఇంతకాలం అధికారంలో ఉండేది పన్నులశాఖ దాడుల నుండి తప్పించుకోవటానికా? సిబీఐ, ఈడి, ఐటి దాడులు వద్దంటే ఆ శాఖ లెందుకు? పదవుల్లో ఉన్నవారిపై సిబీఐ, ఈడి, ఐటీ లాంటి ఆర్ధిక, నిఘా సంస్థలు దాడులు వద్దా? అయితే తదనుగుణంగా ఒక చట్టంచేసి పారేస్తే సరి అంటున్నారు ఈ విషయంపై స్పందించిన ప్రజలు. 


రాహుల్ గాంధి, మమతా బెనర్జి, కుమార స్వామి, చంద్రబాబు నాయుడు, స్టాలిన్ లాంటి ప్రముఖులు తమ పార్టీల్లోని ఆర్ధిక నేరగాళ్ళని కాపాడటానికా? నిఘా సంస్థల దాడులు వద్దంటున్నది? అసలు ఐటి సంస్థ దాడులు జరగనున్నాయని ముక్కుతో వాసన పసిగట్టటానికా ముఖ్యమంత్రి పదవి? పాలన వదిలేసి ఏ కేంద్ర ఐటీ సంస్థ  ఎవరిపై దాడిచేయబోతుందని వాసన చూసి పసిగట్టే పనిలో ముఖ్యమంత్రి ఉండవచ్చా? అదే జరిగితే "కుక్కను గదా! పసిగట్టగలిగా! అని బాహుబలిలో కట్టప్ప అన్నట్లు ఆ స్థానంలో ఒక విశ్వాసవంతమైన కుక్క ….ను ఉంచితే సరి అని పలుమంది అనటం వినిపించింది. మరి సాధారణ ప్రజలపై జరిగే ఐటీ దాడులు పసిగట్టి చెప్పే మంత్రి పదవి క్రియేట్ చెస్తే మాకు మంచిదే కదా! అంటున్నారు వ్యాపారస్తులు.

I-T department seized un-explained cash worth ₹1.10 crores and 10 kg gold from the Karnataka MLA.(PTI file photo)


"సీఎం ఆరోపించిన 24 గంటల్లోనే రాష్ట్రంలో ఐటీ దాడులు జరగడం కలకలం సృష్టిస్తోంది"  అని మీడియా చెప్పేమాట పచ్చి అబద్ధం. ప్రజల్లోకాదు రాజకీయ నాయకుల గుండెల్లో కలకలం రేగుతుందని అంటున్నారు కన్నడిగులు. గురువారం ఉదయం రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి సీఎస్‌ పుట్టరాజు, ఆయన బంధువుల నివాసా ల్లో ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది సంయుక్తంగా సోదాలు చేపట్టారు. ఈయన కూడా కుమారస్వామి సోదరుడు రేవణ్ణ ప్రధాన అనుచరుడే. మండ్య, మైసూరు, హసన్‌, బెంగళూరులోని మంత్రి నివాసం, కార్యాలయం, నీటిపారుదల శాఖ, పీడబ్ల్యూడీ కార్యాలయాలు, కాంట్రాక్టర్ల ఇళ్లల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగు తున్నాయి.’


“మండ్యలోని నా నివాసంలో ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్‌ జవాన్ల బృందాలు సోదాలు జరుపుతున్నాయి. అయితే ఈ తనిఖీలకు నేను భయపడను. నేనే తప్పు చేయ లేదు. ఎన్నికల కోసమే ఈ సోదాలు చేస్తున్నారు. భాజపా నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరగట్లేదు కదా!’ అని మంత్రి పుట్టరాజు అన్నారు. దీనికి ప్రజలు భాజపా వాళ్ళ అవినీతి బయటపెట్టటానికి "అవినీతి నిరోధక శాఖ" ను వినియోగిస్తే సరి.  మాకు కావలసింది ప్రజాధనం దోచుకునేవారు పట్టుపడటమే అని అందరూ అంటున్నారు.


‘దేశంలోని పలు ప్రాంతాల నుంచి 200 300 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది రాష్ట్రానికి వచ్చినట్లు నాకు పక్కా సమాచారం అందింది. ఐటీ దాడులకోసమే వారిని రాష్ట్రానికి పిలిపించారు. గురువారం ఉదయం నుంచి రాష్ట్రంలోని పలుమంత్రులు, ఎమ్మెల్యేల నివాసాల్లో ఈ దాడులు జరిగే అవకాశముంది” అని కుమారస్వామి అన్నారు. అంతే గాక, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయాలని ప్రయత్నిస్తే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీలా తాను కూడా ధర్నాకు దిగాల్సి వస్తుందని కుమారస్వామి హెచ్చరించారు. ఆయన మాటలు టివిలో ప్రసారం కాగానే ఎన్నికల్లో మా ప్రతాపం చూపుతామని యెద్దేవా చేస్తున్నారు. 


రాష్ట్రంలోని హసన్, మాండ్యా, మైసూర్‌లలో సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ అనుచరుల ఇళ్ళలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముగ్గురు కాంట్రాకక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇళ్లలో కూడ  అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరిపై అవినీతి ఆరోపణలు ఇప్పటికీ వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఈ.ఈ. లు గా పని చేస్తున్న నారాయణరెడ్డి, ఆశ్వత్థనారాయణ, రాయగౌడల ఇళ్ళు పూర్తిగా ఐటీ అధికారులు సోదాలకు గురవుతున్నట్లు సమాచారం. రహదార్లు భవనాలశాఖ కాంట్రాక్టర్లపై కొందరు ఫిర్యాదు చేయడంతో ఐటీ సోదాలు సాగుతున్నాయని ప్రచారం సాగుతోంది.


ఎన్నికల సమయంలో కర్ణాటకలో అధికారంలో ఉన్నముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు రేవణ్ణ అనుచరుల ఇళ్లలో సోదాలు సాగడం రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకొంది. అయితే ఈ ఐటీ దాడుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి సీఎం కుమారస్వామి సాధారణంగా అందరూ చెసే విధంగానే తన అక్కసు వెళ్ళ గ్రక్కుతూ విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. అదీ సహజమేగా!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: