ఎడిటోరియల్: చంద్రబాబు పద్దతిలో కుటుంబాన్ని ప్రేమించటం మోడీకి ఏం తెలుసు?

ఈ మద్య నారా చంద్రబాబు నాయుడు కుటుంబం గుఱించి మట్లాడటం మొదలెట్టారు. ఈ దేశంలో బ్రహ్మచారులు ఒక్క శాతం లోపు కూడా ఉండరు. కుటుంబం ఉన్న వారు 99 శాతం మంది. ఈయనొక్కడికే కుటుంబం ఉందా? మిగిలన వాళ్ళు బేకార్లా? ఈయన కుటుంబం ఈయనకు బాంగారు కుటుంబం కావచ్చు జాతి నెత్తిన ధారుణ భారం. ఏ అర్హతా లేని ఈయన కుమారుణ్ణి మంత్రిగా ఏపి వాసులు భరిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. నరేంద్ర మోడీకి కుటుంబం లేదని చిన్నతనంగా మాట్లాడటం ఈయనలోని నీతి మాలినతనాన్ని బయటపెడుతుందని తెలుగు జనం యెద్దేవా చేస్తున్నారు. 

ఈ నారా కుటుంబం జాతి మెడలో గుదిబండ. రెండెకరాల ఆసామి దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా ఉన్నారు? జీవితాంతం కష్టపడి సంపాదించిన ఒక ఐపిఎస్ అధికారి కుటుంబ జీవిత కాల సంపద ఐదు కోట్లు కూడా లేదు. అలాంటిది ఏ అవినీతి చేయకుండానే తల్లి కడుపులోనుండి బయటపడ్డ దేవాన్ష్ ఇరవై కోట్ల రూపాయిల ఆసామి ఎలా అయ్యాడు. ఏ అవినీతి చేయకుండానే ఇది సాధ్యమైందా? 


తన తనయునికి నాడు రాష్ట్రంలోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త స్టాన్-ఫోర్డ్ లో సీట్ కోసం కోట్ల రూపాయిలు కుమ్మరించిన వార్తలొచ్చాయి. అంతేకాదు అమెరికా చరిత్ర లోనే అత్యంత అపఖ్యాతి మూట గట్టుకున్న ఇల్లినాయిస్ రాష్ట్రం లోని విశ్వ విద్యాలయం మహనీయ నారా చంద్రబాబు గారికి డాక్టరేట్ ప్రధానం చేయటానికి అదే యూనివర్సిటీలోని బాబు సామాజికవర్గ వ్యక్తులు విశ్వప్రయత్నం చేయగా నాడు రాష్ట్రమంతా జనం యెద్దెవా చేసిన సంగతి దొరవారి కుల మీడియా దాచిపెట్టినా జన మనోఫలకం నుండి తొలగిపోలేదు. ఇదంతా బంగారు కుటుంబ నిర్మాణంలో చేసిన అద్భుతాలా? అని ఎలుగెత్తి ప్రశ్నిస్తున్నారు ప్రజలు. 

చట్ట వ్యతిరేఖంగా అమరావతి నగర ప్లానింగ్ కు తగని విధంగా నిర్మించిన అక్రమ భవనంలో నివసించే ముఖ్యమంత్రిని మహనీయుడు అనగలమా? ఇక చిత్తూరు పాల సహకార సంఘాన్ని హెరిటేజ్ సంస్థ అభివృద్ధి కోసం మూసేసింది నిజం కాదా?  అణువణువునా కూరుకున్న పాపాల పుట్ట పై కూర్చొని కుటుంబవ్యవస్థను గౌరవిస్తాన నటం, నరేంద్ర మోడీకి అదిలేదనటంలో ఎం న్యాయముంది? అలా నోటి దూల తీర్చుకోవటం ఏమైనా గొప్ప విషయమా?  చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి వెలయాళ్ల గుడిసెలు అన్న నీతి జనాలకు బాగా తెలుసు. 


నరేంద్ర మోడీ కుటుంబం వలన దేశంలో ఏ ఒక్కరికీ ఇబ్బంది లేదు కదా! అదే మీ కుమారుని లోని ఏ నైపుణ్యానికి, సుగుణానికి జాతి అబ్బురపడాలో చెప్పగలరా! ఈయన వలన మీ పార్టీలోని సమర్ధులైన రామమోహన నాయుడు లాంటి యువకుల అవకాశాలు మాయమై పోతున్నాయి. మీ హెరిటెజ్ వలన అనేక ప్రభుత్వ పాల ఉత్పత్తి కేంద్రా లు మూసుకుపోతున్నాయి. మీ బామ్మర్ధి వలన సినీరంగం లోని ఇతరులకు రావలసిన అవార్డులు కోల్పోతున్నారు. ఇదంతా జన హృదయ ప్రతిధ్వని 

ఇదంతా జనంలో వినిపిస్తున్న మీ పట్ల వ్యతిరేఖత. అది ఏ రేంజ్ లో ఉందో తెలుసా? చాపక్రింద నీరులా వ్యాపిస్తుందన్నది మరవరాదు. ఇక మీవల్ల ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా హక్కు నిర్వీర్యమైంది. మీరు చేసిన వోటుకు నోటు కుంబకోణ నేరం వలన ఉమ్మడి రాజధాని ప్రయోజనం కనీస విలువ ఒక లక్ష కోట్లు కోల్పోయింది. మీ దుబారా లతో ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోగా - మీ సామాజిక వర్గంతో సహా ఎవరూ కోరని కులజాడ్యం ఒడిలోకి రాష్ట్రం చేరిపోయిందనేది సర్వత్రా వినిపిస్తున్న జన ఘోష. 


మీరు నందమూరికి ద్రోహం చేశారు కాబట్టే లక్ష్మిస్ ఎన్ టీఆర్ సినిమా విడుదలను అడ్దుకుంటున్నారు తద్వారా ప్రజాస్వామ్యానికి ఆయువుపట్తైన భావవ్యక్తీకరణ వాక్-స్వాతంత్రం వంటి అమూల్యమైన హక్కులను ప్రజలు కోల్పోతున్నారు. 

ఈ దేశానికి ఎంతోకొంత మేలుచేసింది స్వంత కుటుంబం లేనివాళ్ళే. ఉదాహరణకు అబ్దుల్ కలాం, వాజపేయీ, నరేంద్రమోడీ లాంటివారే. ఎందుకంటే వారికి సంపాదించి కుటుంబానికి చేసిపెట్టే పనిలేదు. వారసత్వాల అవసరాలు అసలే లేవు. అదే మంచిది మీలాంటి కుటుంబ స్వార్ధ పరుల అవసరం అసలేలేదు. దట్స్ ఇట్ — అని జనాలు అంటున్నారు. 


నరేంద్ర మోడీ గుజరాత్ అహ్మదాబాద్ లో గ్రామీణమే లేదన్నంత అభివృద్ధి చేశారు. చంద్రబాబు పాలనలో విశ్వనగరం హైదరాబాద్ లేదా సైబరాబాద్ అభివృద్ది చేశా ననటం జాతి ధౌర్భాగ్యం. హైదరాబాద్ వాతావరణం పరిస్థితులు గత 500 సంవత్సరాల పునాదులపై నగరం నిర్మితమైంది. ఆపై అభివృద్ధి చెందింది. మీ స్థానంలో నాడు ఎవరున్నా నగరం ఇంకా అభివృద్ధి చెంది ఉండేది. ఆ సమయంలో అనేక భారత నగరాలు సాంకేతిక పరిఙ్జానంతో విలసిల్లాయి. అసలు బంగళూరు, చెన్నై, నోయిడా, పుణే, గాంధీనగర్  అహ్మదాబాద్ నగరాల అభివృద్దితో పోలిస్తే హైదరాబాద్ లో నీవు చేసిందెంత అని జనాలు ప్రశ్నిస్తున్నారు .


ఆంధ్రులు లేకుంటే హైదరాబాదే లేదన్న నీ వాచాలత గర్హనీయం మిస్టర్ చంద్రబాబు!  అయితే హైదరాబాద్ ను తీర్చిదిద్దిన వారిలో ఆంధ్రులూ ఉన్నారనటం నిజమైన మర్యాద. ఇలాంటి మాటల తోనే జాతి బీటలు వారింది. ఏపి ప్రజలు కాదు గాని ఏపి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పారిశ్రామికవేత్తలంటూ భూ-పందేరమే విశాల తెలుగు రాష్ట్రాన్ని విచ్చిన్నమవటానికి కారణం కాదా!  ఈ మొత్తం పాపానికి అంకురార్పణ చేసి హైదారాబాద్ నుంచి పారిపోయి తెలుగువారి ఉమ్మడి రాజధాని హైదారాబాద్  కాకుండా చేసింది మీరే కదా స్వామి! అని జనం అంటున్నారు. అంతేకాదు మొత్తం నాలుగేళ్లు బిజేపితో అంటకాగి ఒక ఆర్నెల్లు ప్రతి క్షణం ఆ పార్టీని మోడీని శపిస్తే మీరు మీ పార్టీ గెలుస్తుందను కోవటం ఒట్టి భ్రమగా జనం వెనోళ్ళతో చెపుతున్నారు. 


నరేంద్ర మోడీ కుటుంబాన్ని గౌరవించరనడం హాస్యాస్పదం. కుటుంబాన్ని గౌరవించటం అంటే కుటుంబలోని వ్యక్తులకోసం జాతి సంపద దోచెయ్యటం కాదన్నది మీరు గుర్తిస్తే మంచిదని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.

మరో ముఖ్యవిషయం మీది జాతీయ పార్టీకాదు. జస్ట్ 25 పార్లమెంట్ స్థానాలున్న రాష్ట్రంలో మీకు మహా అయితే సర్వేలు వైఫల్యమైనా ఐదు కంటే ఎక్కువ గెలవలేరని జనఘోష. 42 స్థానాలున్న విశాల ఏపిని ఏలిన మీరు ఇప్పుడు 25 స్థానాలున్న చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మిమ్మల్ని ఈ స్థాయికి కుదించిన కాంగ్రెస్ తో మీకు దోస్తీ ఏమిటి ప్రభూ! అంటున్నారు విఙ్జులు.       
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: