వింత సర్వే : జనసేనకు 85 సీట్లు .. ఇంత కంటే పైత్యం ఉందా .. ?

Prathap Kaluva

జనసేన పరిస్థితి ఏంటో పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసు. ఆ పార్టీకి ఎంత సీన్ ఉందో పాపం జనసైనికులకు తెలియడం లేదు. తాజాగా, ఓ వింత సర్వే వెలుగులోకి వచ్చింది. ఇందులో ఏకంగా జనసేన పార్టీకి 70 సీట్లు కట్టబెట్టేశారు. మరో పదిహేను చోట్ల జనసేన గెలుపు అవకాశాలు సుస్పష్టమట. అంటే, జనసేనకి 85 సీట్లు దాదాపుగా కట్టబెట్టేసినట్లేనన్నమాట. ఇంకా చిత్రమైన విషయమేంటంటే, తెలుగుదేశం పార్టీకి రెండో స్థానమూ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మూడో స్థానమూ ఈ సర్వేలో ఇవ్వడం. సర్వే అదిరింది కదూ.!


నిజానికి, ఇప్పటిదాకా వెలుగుచూసిన ఏ సర్వేలోనూ జనసేన పార్టీని అసలు పట్టించుకున్నదే లేదు. 'ఇతరులు' కోటాలో రెండు నుంచి నాలుగుశాతం ఓట్లను మాత్రం జనసేనకు రావొచ్చని అంచనా వేశారు చాలా సర్వేల్లో. పవన్‌కళ్యాణ్‌ అగ్రెసివ్‌గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న దరిమిలా, ఆ ఓట్ల శాతం ఇంకాస్త పెరుగుతుందేమోగానీ, మరీ 70 సీట్లను జనసేన సాధించే పరిస్థితి అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.


ఇక, ఈ ఫేక్‌ సర్వే పట్టుకుని జనసైనికులు సోషల్‌ మీడియాలో చేస్తున్న హంగామా అంతాఇంతా కాదు. 'పవన్‌కళ్యాణ్‌ కాబోయే ముఖ్యమంత్రి.. మే 23న ఈ విషయం అధికారికంగా రుజువు కాబోతోంది..' అంటూ సోషల్‌ మీడియాలో 'కిర్రాకు' పుట్టించేస్తున్నారు. పూర్తిగా అన్నిచోట్లా అభ్యర్థుల్ని నిలబెట్టలేక, బహుజన్‌ సమాజ్‌ పార్టీని ఆఖరి క్షణంలో అరువు తెచ్చుకున్న పవన్‌కళ్యాణ్‌ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయగల స్థాయిలో ఓట్లు దక్కించుకోగలడని ఎలా అనుకోగలం.?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: