ఇంటి కోసం అప్పు చేసిన వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన జగన్…!
పేదలకు ఉచితంగా వచ్చే ఇళ్లపై అక్రమంగా తెలుగుదేశం ప్రభుత్వం సంపాదించాలని చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ఎండగట్టారు జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఇళ్ల కోసం ఇచ్చే రుణాలను మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. చంద్రబాబు హయాంలో పేదలకు చదువు దూరమైందని...ఉద్యాన మొత్తం తన బినామీలకు కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పజెబుతూ ...ప్రాధమిక విద్య నుండి ఇంజనీరింగ్ చదివే వరకు విద్యను ప్రైవేటీకరించారని జగన్ ఆరోపించారు.
చంద్రబాబు హయాంలో నాలుగున్నర సంవత్సరాలలో ఇప్పటి వరకు ఏ విధమైన అభివృద్ధి జరగలేదని కానీ ఎన్నికల చివరాకరికి వచ్చేసరికి ఏవో కల్లబొల్లి కబుర్లు చెప్పుకొంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జగన్ పేర్కొన్నారు.
వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడు సంతోషంగా బతికేలా వారి పిల్లలు ఉన్నత చదువులు చదివే ల సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయని జగన్ హామీ ఇచ్చారు. అయితే రానున్న ఎన్నికల్లో ఇంకా కొద్ది రోజులే ప్రచారం మిగిలి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు చెప్పే అబద్ధాలకు మోసపోవద్దని మరొకసారి మనల్ని మనం మోసం చేసుకోకుండా రాష్ట్రాన్ని కాపాడుకుందామని ప్రజలకు సూచించారు జగన్.