మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణ ఎన్నికల ముందు బ్రహ్మాస్త్రం ... లోకేష్ పని ఖతం ..?

Prathap Kaluva

ఇప్పుడు మంగళగిరి నిజయోజకవర్గం బాగా ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం దానికి లోకేష్ పోటీ చేస్తున్నడటమే.  లోకేష్ పోటీచేస్తున్న మంగళగిరిలోనూ బాబు చేతిలో మోసపోయిన ఆ నియోజకవర్గ ఇన్ చార్జి ఒకరు ఉన్నారు. ఆమె కాండ్రు కమల.. లోకేష్ పోటీచేయకముందే టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న కమలను తప్పించి బాబు లోకేష్ కు టికెట్ ఇచ్చాడు. కమల చేనేత కుటుంబానికి చెందిన మహిళ. మంగళగిరిలో చేనేతల ప్రాబల్యం.. ఓటు బ్యాంకు ఎక్కువ. అందుకే ఐదేళ్లుగా ఆమెకు నియోజకవర్గ ఇన్ చార్జిని ఇచ్చి చివరకు ఆమెను లోకేష్ కోసం బాబు బలిచేశాడు.


దీంతో ఆమె వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణకు మద్దతు ప్రకటించి టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ తరుఫున ఆళ్లతో కలిసి ప్రచారం చేస్తున్నారు. కాండ్రు కమలను బాబు మోసం చేయడం చేనేతలనే కాదు.. నియోజకవర్గంలోని బీసీలను అంసతృప్తికి గురిచేసింది. బీసీలందరూ ఈసారి లోకేష్ ను ఓడించడానికి మంగళగిరిలో కంకణం కట్టుకున్నారట..అయితే సీఎం కొడుకు పోటీచేస్తుండడంతో ఇక్కడ డబ్బులు ఏరులై పారించి అధికారుల తోడ్పాటుతో గెలిపించాలని బాబు పెద్దపెద్ద స్కెచ్ లు వేస్తున్నాడట.


లోకేష్ ను గెలిపించడానికి ఏం చేయడానికైనా రెడీ అయ్యారట.. దీంతో అలెర్ట్ అయిన వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు..తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే.. 2024లో అశేషంగా ఉన్న చేనేత వర్గానికే సీటును వదిలేస్తానని.. తాను జగన్ ను ఒప్పించి ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. ఈసారి తనను గెలిపించి వచ్చేసారి మీరే ఎమ్మెల్యేగా గెలవండని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ప్రకటన బీసీలు చేనేతలను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీంతో లోకేష్ బాబు ఓటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: