ఎన్టీఆర్‌ బయోపిక్స్, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పై ఎన్టీఆర్ కూతురి సంచలన వ్యాఖ్యలు..?

Chakravarthi Kalyan
లక్ష్మీస్‌ ఎన్టీఆర్.. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కుటుంబం ఎంతగా ఇబ్బంది పెట్టిందో చూపించారు ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాలో లక్ష్మీపార్వతిని అమాయకురాలిగా.. ఎన్టీఆర్ కుటుంబాన్ని విలన్‌గానూ వర్మ చూపించారు. ఓ దశలో ఎన్టీఆర్ కూతురు ఒకరు లక్ష్మీపార్వతిపై చేయి చేసుకుని బూతులు కూడా తిడతారు. 


అయితే ఈ పాత్ర ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి అని చాలామంది చర్చించుకున్నారు. అయితే పురందేశ్వరి మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. సినిమాలో తాను లక్ష్మీపార్వతిని కొట్టినట్లు చూపించిన సన్నివేశాల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. 

అంతే కాదు.. ఇటీవల బాలయ్య తీసిన ఎన్టీఆర్ బయోపిక్స్ పైనా పురందేశ్వరి కామెంట్ చేశారు.  చిన్నప్పటి నుండి నాన్నగారు ఎదుర్కొన్న కష్టాలను, ఒడిదుడుకులను కూడా సినిమాలో చూపించి ఉంటే బాగుండేదని అన్నారు. బయోపిక్ అంటే అన్నీ చూపించాలని పురందేశ్వరి చెప్పడం కలకలం రేపుతోంది. 

అన్నీ చూపించాలి అంటే ఎన్టీఆర్‌ కు చంద్రబాబు అండ్ టీమ్ చేసిన వెన్నుపోటు కూడా చూపించాల్సి ఉంటుంది. మరి అప్పుడు పురందేశ్వరి భర్త దగ్గుబాటి కూడా చంద్రబాబుకు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. మరి ఆ ఎపిసోడ్ కూడా డిటైల్డ్ గా చూపిస్తే.. పురందేశ్వరి ఏమంటారో.. అని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: