సీబీఐ, ఐటీ, ఈడీ, అన్ని భ్రష్టు పట్టాయి : వాటిపై పోరాడుతామనే వారు ప్రజాస్వామ్యవాదులు ?

Satya

అదేంటో నీతులు చెప్పడం వరకే అంతా. వినేవారుంటే ఎన్ని కబుర్లైనా చెబుతారు. దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిగా తనకు తానే చెప్పుకునే చంద్రబాబు ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. ఎన్నికల కోడ్ ఓ వైపు ఉంటూండంగానే మీడియాని మొత్తం వాడేసుకుని ఎన్నికల లాభాన్ని పొందాలనుకోవడం బాబు గారి మార్క్ ప్రజాస్వామ్యం.

 


పద్నాలుగేళ్ళ పాటు ముఖ్యమంత్రి, నలభయ్యేళ్ళ రాజకీయ జీవితం అని చెప్పుకునే చంద్రబాబు చేసున్నదేంటి. దేశంలో అలా ఎవరైనా చేస్తున్నారా అన్నది ఇపుడు ఆలోచించాలి. ఓ వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ప్రచారానికి నిన్న సాయంత్రంతో గడువు ముగిసింది. మరి బాబు గారు మాత్రం నిన్న ఆరు దాటాక మీడియా మెటింగు పెట్టారు. ప్రజలకు బహిరంగ లేఖలూ రాస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా ఇవాళ ఏకంగా నిరసనలకు దిగిపోయారు. అదీ ఈసీ ఎదురుగా. ఇదేమన్నా బాగుందా బాబు గారు అని ఎవరూ అడగకూడదు. ఎందుకంటే ఆయన కంటే గొప్ప ప్రజాస్వామ్యవాది మరోకరు ఉండరంటే ఉండరు కదా.

 



ఓ వైపు సీబీఐ, ఈడి, ఐటీ అన్ని వ్యవస్థలు  బ్రష్టు పట్టిపోయాయని ఇదే గొంతుకతో బాబు గారు అంటారు. మరో వైపు ఇదే బాబుగారు మాత్రం తానే పెద్ద గొంతు చేసుకుని ఏకంగా ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటి ఈసీ మీద దాడి చేస్తారు. ఇప్పటికి ఈ వారం పది రోజులో ఈసీ మీద రచ్చ రచ్చ చేసిన వారు దేశంలో బాబు కంటే ఎవరూ లేరేమో. తాను సీనియర్నని చెప్పుకునే బాబు తీరు ఇలా ఉండడమే బాధాకరం. బాబు తెలివైన ఎత్తుగడ వేస్తున్నారు.

 


ప్రచారం చేయవద్దన్న ఈసీ నిబంధనలు సీనియర్ అని చెప్పుకునే బాబు గారే తుంగలోకి తొక్కుతున్నారు.  మరి ఇదేనా బాబు వ్యవస్థలను కాపాడే విధానం. ఈ దేశంలో ఈసీ సర్వ స్వతంత్రమైనది. దాని మీద కూడా అభాండాలు వేస్తూ మొత్తం ప్రజాస్వామ్యం మీదనే విశ్వాసం లేకుండా చేస్తే దాని వల్ల కలిగే అనర్ధాలకు బాబు బాద్యత వహిస్తారా. ఏది ఏమైనా పోనీ, ఎన్నికల్లో విజయమే పరమాధిగా చేసే రాజకీయం దారుణమే. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి అసలైన ప్రమాదం కాదా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: