చాణక్య మరణ రహస్యం

చాణక్యడు అనే మహిమాన్విత వ్యక్తిత్వం ప్రాచీనభారత మరపురాని అత్యంత అద్భుతమైన వ్యక్తిత్వాలలో ఒకటి. ఆర్థికరంగ నియమాలు రాజ్యపాలన సూత్రాల ను తన రెండు గొప్ప రచనలు చేసి తద్వారా విశేష సేవలు అందించిన ఆయన కృషి, 2500 సంవత్సరాల తరవాత కూడా నేటికి కూడా మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. ఈ అద్భుత రాజనీతిఙ్జుడు చాణక్య విరచిత అర్ధశాస్త్రం మరియు చాణక్య నీతిసూత్రాలు రెండు గొప్పరచనలుగా విశ్వవిఖ్యాతి గడించాయి.  

చాణక్యుడు దేశ సమగ్రత, సమైఖ్య భారత నిర్మాణం కోసం నాడు ఒక సాధారణ వీధి బాలుణ్ణి ఎంపిక చేసుకొని అతనిని ఒక గొప్ప చక్రవర్తిగా మలిచి ఒక శక్తి వంతమైన సార్వభౌముడుగా అతనిని తీర్చిదిద్ది ఆపై ఆ చంద్రగుప్త నాయకత్వానికి ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించి ఇచ్చిన మహామహిమాన్వితుడు గా విశ్వవిఖ్యాతిగాంచారు.


నంద సామ్రాజ్యసభలో తనకు జరిగిన పరాభవానికి,  ప్రతీకారం తీర్చుకొనే క్రమంలో, ఆ బాల చంద్రగుప్తుని ఒక అద్భుత రాజ్య పాలకుడుగా రాజనీతిఙ్జునిగా తీర్చిదిద్ది ఒక గొప్ప సామ్రాజ్యానికి పాలకుడిగా చేసాడు.


కౄరరాజులు నందులపై చాణక్యుడు ప్రతీకారం తీర్చుకోవాలని, శపధాన్ని నిజం చేసుకోవాలని ఆ కార్యసాధన మార్గంలోనే  చంద్రగుప్త మౌర్యుని లాంటి గొప్ప చక్రవర్తి మరియు భారత వర్ష నిర్మాతగా ప్రపంచానికి తనను నిరూపించుకున్నారు. అయితే చంద్రగుప్తుడి స్వర్ణ యుగపాలన అనంతరం, తన కుమారుడు బిందుసారునికి సింహాసనం అప్పగించి, తాను వాన ప్రస్థాశ్రమం చేరటంతో ఆయన శకం ముగిసి బిందుసారుని శకం ప్రారంభమైంది. చంద్రగుప్తుని కోరికతో బిందుసారునికి రాజ్యపాలన లో తన సలహా సహకారం అందించటానికి, తన ఆధ్యాత్మిక జీవితం గడపటానికి చాణక్యుడు నిశ్చయించుకున్నాడు.  

అయితే ఆ తరవాత  చాణక్య మరణం పండితులు అనేక పరిశోధనలు చేసినా ఇప్పటి వరకు ఆ మరణ మర్మము నిర్ధారణ కాలేదు. ఏది ఏమయినప్పటికీ, చాణక్యుని మరణానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి, అతను తనను తాను చంపు కున్నట్లు ఒక ఆలోచన కాగా, మరొకటి ఒక తెలివైన కుట్రకు బలై చంపబడ్డాడని చెప్పుకుంటాడు. ఏదేమైనా, ఈ రెండు సందర్భాలు అతడితో విధి ఆడిన వింతనాటకంగానే  చెప్పవచ్చు. 



చంద్రగుప్తుని కోరిక ప్రకారం బిందుసారునికి ముఖ్య సలహాదారుగా చాణక్యుడు కొనసాగారు అయితే చాణక్యుడితో బిదుసారుని సాన్నిహిత్యం అనిర్వచనీయంగా ఉండేది. ఒక తాత మనవడిలా ఒకసారి గురు శిష్యులుగా మరోసారి చూపరులకు కనిపించేది. దాన్ని సహించలేని మంత్రి సుబంధు అసూయతో వారిరువురి మధ్య అత్యంత భయంకరమైన శత్రుత్వాన్ని సృష్టించేందుకు మాయోపాయంతో కుట్ర పన్నాడు. 

తన తల్లిని చంపింది చాణక్యుడే అని బిందుసారుడు నమ్మేటంతటి కుట్రపూరిత వ్యూహాన్ని పన్ని దాన్ని నమ్మించాడు మంత్రి సుబంధు. ఇది చాణక్యుని పట్ల బిందుసారునిలో తీవ్ర ధిక్కారం సృష్టించింది. తను ప్రాణప్రధంగా భావించిన బిందుసారునిలో ప్రభలిన అనౌచిత్య ప్రవర్తన చాణక్యునిలో ఒక విధమైన విరక్తిని పెంపొందించింది. ఆ తరవాత చాణక్యుడు బిందుసారుని ప్రవర్తనతో విసిగి పోయాడు – ఇమడలేని పరిస్థితుల్లో రాజభవనం వదలి ఆహారాన్ని పరిత్యజించి ఆకలితో తనను తాను అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

కొంతకాలం గడచిన తరువాత బిందుసారుని తల్లి "మహారాణి-సామ్రాఙ్జి దుర్ధర"  అవసానదశలో ఆమెతో ఉన్న ఒక సేవకురాలు ద్వారా మహారాణి మరణంలో చాణక్యుని అపరాధము ఏమిలేదన్న రహస్యం తెలుసుకుంటాడు బిందుసారుడు.

ఆ నేపధ్య కథ ఇలా ఉంది:

బిందుసారుని తండ్రి చంద్రగుప్తుని రాజ్యపాలనం చెసే రోజుల్లో శత్రువులనుండి విషప్రయొగాలతో దాయాదులపై కుట్రలు జరగటం సాధారణమైంది. అందుకే దుర్ధర గర్భవతిగా ఉన్నప్పుడే విషప్రయోగం ప్రభావం పడకుండా ఉండటానికి చాణక్యుడు ఆమెకు రోజు వారీ విషాన్నితట్టుకొనే విషనిరోధక శక్తిని అందించే  ఔషధాలతో ఆహారాన్ని ఆమెకు తెలియకుండానే పటిష్టం చేశాడు. 

ఈ విధమైన ఆహారం గర్భంతో ఉన్నరాణికే కాకుండా చక్రవర్తి కుటుంబ సభ్యులందకీ ఒక విధమైన ఆహారక్రమం ఉండేది. ఇది తెలియకపోయినా, ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు చంద్రగుప్తునితో కలసి తమకై ఉంచిన లేదా తయారు చేసిన  ఆహారాన్ని రాణి దుర్ధ తీసుకునేవారు. అనుకోని పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యానికి గుఱి కావటంతో కనీసం వారసుడిని కాపాడాలని నిశ్చయించుకున్న చాణక్యుడు - బిడ్డను రక్షించడానికి తల్లి గర్భాన్ని తెరిచాడు. ఈ ప్రక్రియ అనంతరం రాణి దుర్ధ చనిపోయింది. 

ఈ విధంగా, చాణక్యుడు సామ్రాజ్యపరిరక్షణకు, వారసుడు బిందుసారుణ్ణి గర్భంలోనే మరణించకుండా కాపాడటం, ఒక అద్భుతమైన విషయంగా చెప్పవచ్చు. తన తల్లి అవసానదశలో ఆమెతో ఉన్న సేవకురాలి ద్వారా సంపూర్ణ అవగాహన కలిగి, అసలు నిజం తెలుసుకున్న బిందుసారుడు తన తండ్రి లాంటి  చాణక్యుని పట్ల తనెంత ఘోరమైన తప్పు చేశాడో గ్రహించాడు. ఆ తరవాత బిందుసారుడు చాణక్యునికి తృప్తి పరచటానికి తిరిగి రాజభవనానికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు చాణక్యుని అనంగీకారంతో విఫలమవగా మరణం వరకు ఆకలితో గడిపి తుదిశ్వాస తీసుకుని చాణక్యుడు మరణించాడు. 

మరొక అభిప్రాయం ప్రకారం, అసూయతో కుతకుతలాడే, సుబందుడే తెలివిగా అతన్ని నివాసగృహంలోనే సజీవంగా కాల్చివేశాడని అంటారు. అందు లోని దుష్ట ప్రణాళిక తెలుసుకున్న కారణంగా బిందుసారుడే సుబంధుకు మరణశిక్ష వెశాడని తెలుస్తుంది. అయితే, చాణక్య మరణ రహస్యానికి సంబందించిన చరిత్ర ఇప్పటికీ అసమగ్రంగానే ఉండి పోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: