ఫేక్-ట్వీట్ తో టిడిపి ప్రచారం-టిడిపికి ఓటమి తప్పదు ప్రశాంత్ కిషొర్

రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని సర్వేలన్నీ ఘోషిస్తుండడం, క్షేత్ర స్థాయిలో ఫ్యాన్‌ ఫుల్‌ స్పీడ్‌ లో తిరుగుతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన దిగజారుడు రాజకీయాలకు మరోసారి పదును పెంచి అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికే ఫేక్‌ ఆడియోలు, ఫేక్‌ గొడవలు, ఫేక్‌ ధర్నాలు, ఫేక్‌ సర్వేల పేరుతో అనుకూల మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేపించిన చంద్రబాబు, చివరి అస్త్రంగా పోలింగ్‌ జరుగుతున్న సమయంలోనే ఫేక్‌ ట్వీట్‌లను సృష్టించి ఓట్లు రాబట్టాలనుకున్నారు.

ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పేరిట ఓ ఫేక్‌ ట్వీట్‌ను సృష్టించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. అయితే ఈ తప్పుడు వార్తలపై ప్రశాంత్‌ కిషోర్‌ తన అధికారిక ట్విట్టర్‌లో స్పందించారు.


ఇటీవలే జేడీయూ పార్టీలో చేరి వైస్ ప్రెసిడెంట్‌ గా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ కిషోర్, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షం వైసీపీకి రాజకీయ సలహాదారుగా మార్గదర్శిగా ఉన్నారు. అయితే ఈ వైసిపి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పేరిట సర్క్యూలేట్ అవుతున్న ఫేక్-న్యూస్‌ పై ఘాటుగా స్పందించారు.

చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నానని గ్రహించి, ఫేక్-న్యూస్ ప్రచారం చేస్తున్నారని, తద్వారా ఓట్లర్లను రకరకాల అబద్ధాల ప్రచారంతో ప్రలోభాలతో తనవైపునకు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడికి ఓటమి తథ్యమని, ఏపీ ప్రజలు ఎవరికి ఓటు వేయాలనే నిర్ణయానికి ముందుగానే వచ్చారని అన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ ముగిసే కొద్ది గంటల ముందే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు బైబై చెప్పేశారని ట్వీట్ చేశారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఇప్పుడు వైసిపి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ పేరుతో ఒక ఫేక్ ట్వీట్ సృష్టించారట. ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ వెల్లడిస్తూ ఓటమి కళ్ల ఎదుట కనిపిస్తున్నప్పుడు నిర్వేదం నిరాశ నిస్పృFహ కమ్ముకున్న వాళ్లు ఇలాంటి పనులే చేస్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీ దిగజారుడు తనానికి ఇది నిదర్శనమని పరాకాష్ట అని అన్నారు. 


ప్రజల్లో విశ్వాసం కోల్పోయినప్పుడు ఇలాంటి అసత్యాలు, అబద్ధపు వార్తలను తప్పుడు పనులు చేస్తారన్నారు. అయితే ఇప్పుడు టీడీపీ ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఏపీ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును నిర్ణయించుకున్నారని "బై..బై.. బాబు!" అంటూ ట్వీట్‌ చేశారు.


@ncbn⁩ when you lose trust of the people and your faith in their wisdom, after abuses and lies, you stoop down to circulating fake news. Few hours left for the polling to close but it’s clear that people of AP have decided their verdict. It is time to say #ByeByeBabu pic.twitter.com/TH3K4dwXqB— Prashant Kishor (@PrashantKishor) April 11, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: