గోదావరి జిల్లాలలో ' పవన్ పవర్ ' - టీడీపీని మూడో స్ధానానికే పరిమితం చేసిన పవన్ ..?

VUYYURU SUBHASH
ఏపీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీని త‌మ భాగ‌స్వామ్య పార్టీకే ప్రొజెక్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన టీడీపీకి ప‌వ‌న్ త‌న ప‌వ‌ర్ ఏంటో చూపించిన‌ట్టు పోలింగ్ స‌ర‌ళి చెపుతోంది.  ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రచారపర్వంలో తెలుగుదేశం పార్టీ నేతలందరూ మోడీ, కేసీఆర్, జగన్ ఒకటే అని తెగ ఊదరగొట్టేశారు.
అదే టైంలో జనసేన తమ భాగస్వామ్య పార్టీ అని పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం ద్వారా ఆ పార్టీని దెబ్బ కొట్టే సమని సంకలు గుద్దుకుంటున్నారు వాస్తవంగా జరిగిన తీరును బట్టి చూస్తే జనసేన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ కి అదిరిపోయే ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రచారపర్వంలో పవన్ కళ్యాణ్ సైతం ప్రధానంగా జగన్ కేసీఆర్ ను టార్గెట్ చేసి టిడిపిపై పెద్దగా విమర్శలు చేయక పోవడంతో చాలామందికి పవన్ చంద్రబాబు ఒకటేనా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.


ఇక పోలింగ్ జరిగిన గ్రౌండ్ రిపోర్ట్ ను బట్టి చూస్తే జనసేన ప్రధానంగా దృష్టి సారించిన గోదావరి జిల్లాల్లో టిడిపి కి అదిరిపోయే షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో లో జనసేన 8 నుంచి 10 నియోజకవర్గాల్లో బలంగా ఓట్లు చేర్చడంతో టిడిపి కొన్నిచోట్ల మూడో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది. 
జనసేన చీల్చిన‌ ఓట్ల ఎఫెక్ట్ వల్ల కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు అవకాశాలు సంక్లిష్ట‌మ‌య్యాయి.  పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన రెండు సెట్లలో లో గెలుపు బాటలో ఉంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి మూడో ప్లేసే అంటున్నారు. గుంటూరు జిల్లాలో సైతం జనసేన రెండు నియోజకవర్గాల్లో గెలిచే స్థితిలో ఉండటంతో పాటు ఏడెనిమిది నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టింది.


అనంతపురం జిల్లాలో రెండు కర్నూలు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో సైతం జనసేన ఎఫెక్ట్ టీడీపీకి గట్టి గా పడింది. నెల్లూరు జిల్లాలో ఒక నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో రెండు నియోజకవర్గాలు, విజయనగరం జిల్లాలో కూడా ఒక నియోజకవర్గంలో జనసేన చీల్చిన ఓట్లు టిడిపి గెలుపు అవకాశాలపై దెబ్బ కొట్టి నట్టు తెలుస్తోంది. అలాగే జనసేన ప్రధానంగా దృష్టి సారించిన మరో జిల్లా అయిన‌ విశాఖపట్నం జిల్లాలో ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గంలో జనసేన గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఏడు ఎనిమిది నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల గెలిచే ఛాన్స్ ఉండటం ఒక ఎత్తు అయితే... మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీయడం మరో ఎత్తు. అలాగే విశాఖ ఎంపీ సీటు ని సైతం జనసేన గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్టు టాక్. ఏదేమైనా జనసేన ఎన్నికల ప్రచార సరళిని బట్టి తమకు సపోర్ట్ చేస్తుందని భావించిన టిడిపికి పోలింగ్‌లో మాత్రం ఆ పార్టీ నుంచి అదిరిపోయే దెబ్బప‌డింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: