చంద్రబాబు బ్రాహ్మణ ద్వేషి! సిఎస్ పై ఆయన వ్యాఖ్యలు, బాష అభ్యంతరకరం! దేశవ్యాప్త చర్చ!

ఏపి ముఖ్యమంత్రి మానసిన సమతౌల్యత కోల్పోయి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లంకా వెంకట సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదిలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఈ ప్రజాస్వామ్య సమాజంలో కలకలం రేపుతున్నాయి. కలవరం కలిగిస్తున్నాయి.

నారా చంద్రబాబు నాయుడు తను ప్రతిక్షణం తనను గురించి తాను చెప్పుకునే నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవం — ఆయన ప్రభుత్వ అధికారులపై చేసే వ్యాఖ్యలలో కనిపించటం లేదు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విశ్రాంత ఐఏ ఎస్ అదికారులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు నాయుడు ఉపయోగించిన పదజాలం సరికాదంటూ మండి పడ్డారు.


ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను విశ్రాంత ఐఏఎస్ అధికారులు మండిపడుతున్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోవర్టుగా బాబు అనడం దారుణమన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. సీఎస్ పై చంద్రబాబు నాయుడు వాడిన బాష, వ్యాఖ్యలు సరికావంటూ లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను దోషిగా ఎక్కడా న్యాయస్థానాలు తేల్చలేదని స్పష్టం చేశారు. తక్షణమే ఎల్వీకి క్షమాపణ చెప్పాలని కోరారు.


అంతే కాకుండా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కూడా నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖరాశారు. చంద్రబాబు తనకు వంతపాడే వారే అధికారులగా ఉండాలని భావిస్తున్నట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదిపై చంద్రబాబు అనుసరించిన తీరు సరికాదని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ చీఫ్ సెక్రటరీలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు. చంద్రబాబు ప్రభుత్వాధికారుల పట్ల ప్రవర్తించిన తీరు రాష్ట్రానికి ఏమాత్రం గౌరవం ఆపాదించదని వారన్నారు. 

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి బ్రహ్మణ అధికారులపై కక్షగట్టారని బ్రహ్మణ సంఘాలు విశ్వసిస్తున్నాయి. 

బ్రాహ్మణులపై కక్ష కట్టిన సీఎం చంద్రబాబు తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్‌ చంద్ర పునేఠ ను తాను చెప్పినట్టే వినాలని ఒత్తిడి తెచ్చి ఆయనను బలిపశువును చేశారని, ఆయన స్థానంలో ఎన్నికల సంఘం మరో బ్రాహ్మణ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం ను సీఎస్‌గా నియమిస్తే ఆయననూ అవమానించేలా మాట్లాడారంటూ అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌ మండిపడ్డారు. చంద్రబాబుపై బ్రాహ్మణ సంఘం మండి పడుతోంది. 

వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి కేసుల్లో ఎల్వీ సుబ్రమణ్యం నిందితుడు కాదంటూ 2018 జనవరి లోనే ఉమ్మడి ఏపీ హైకోర్టు కొట్టివేసిందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం నేరం కిందకు వస్తాయన్నారు. డీజీపీ కార్యాలయానికిగాని, పోలీస్ కంట్రోల్ రూముకు గాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెళ్లడమనేది ఎన్నికల ప్రక్రియలో ఒక భాగమని తెలిపారు.


ఎల్వీఎస్ ను సీఎస్‌ గా ఎంపిక చేయడంపై బాబు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్‌ అధికారుల సంఘంతో పాటు వివిధ ఉద్యోగుల సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంద న్నారు. గతంలో బాబు, ఆయన పార్టీ నేతలు అడ్వకేట్‌ జనరల్‌ వేణుగోపాల్‌ విషయంలోనూ, రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం విషయం లోనూ వ్యవహరించిన తీరును బ్రాహ్మణులు ఇప్పటికీ మరిచి పోలేకుండా ఉన్నారు. చంద్రబాబుకు ఇప్పుడు బ్రాహ్మణుల శాపం తగలక తప్పదని ప్రజలు ముక్తకంఠంతో ప్రకటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: