లా మేకర్ చంద్రబాబు ఉన్నత స్థాయి ఎక్జెక్యూటివ్ పై దాడిచేసి పాలనపరంగా సాధించేదేమిటి?

ఎక్జెక్యూటివ్, లెజిస్లేచర్ మీద తిరగబడే పరిస్థితులు ఏపిలో ఏర్పడటానికి కారణమెవరు? పరువు నష్టం కేసుకు సిఎస్ ముందుకు కొనసాగనున్న వార్త విషయంలో నిజమెంత? అసలు ఆ దుస్థితి ఏపికి ఎందుకుపట్టింది? ఎన్నో ప్రశ్నలు.    

శాసననిర్మాణ వ్యవస్థల్లోని వ్యక్తులు కాస్త విఙ్జతతో వ్యవహరించటం చాలా అవసరం. ఎన్నికల సమయం లో ప్రభుత్వ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయటం సర్వ సాధారణ విషయం. ఎన్నికల సంఘం స్వయం నియంత్రణ కలిగిన రాజ్యాంగ వ్యవస్థ. అందుకే తమకు అందిన పిర్యాదుల మేరకు గాని, అవసరమని గుర్తించిన సందర్భాల్లో స్వయం నిర్ణయం తీసుకొని బదిలీలు చేసే అధికారం వారికి ఉంది. వారిని ముఖ్యమంత్రితో సహా వెరెవరూ ఈ విషయంలో ప్రశ్నించే అధికారం లేదు.


అలాంటి దాన్ని ఆధారంగా దేశవ్యాప్తంగా చంద్రబాబు ఎన్నికల సంఘంపై నానా యాగీ చేయటం సుధీర్ఘ రాజకీయ జీవితం కలవాడుగా తనకు తాను చెప్పుకునే చంద్ర బాబు నాయుడు కే చెల్లింది. 

ఎన్నికల సంఘ నిర్ణయాల - నేపధ్యంలో నరేంద్ర మోదీ ఉన్నట్లు చెప్పటం ఆయన దయనీయ మానసిక స్థితిని తెలియజేస్తుంది. ఎన్నికల సంఘం మోడీ మాట విని పని చెస్తే దేశ ప్రధాని అయి ఉండి ఎన్నికల సమయంలో తనపై నిర్మించిన బయోపిక్  “పిఎం నరేంద్ర మోడీ” సినిమా విడుదల వాయిదా వేస్తే మౌనంగా ఉన్నారు  ఆ సినిమా విడుదలైతే ఎన్నికల ప్రచారంలో మోడీకి, బిజెపికి ఎంతో ఉపయోగపడేది.  


అలాగే ఎన్నికలసంఘం బదిలీలతో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డ ఎల్వి సుబ్రమణ్యంను వ్యక్తిగతంగా"కోవర్ట్"అంటూ అవమానించటమే కాకుండా,  వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనను సహ నిందితుడిగా పేర్కొనడంపై కొంత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది.  అంతే కాదు తనపై మరింత బురద చల్లే ప్రయత్నాలను నిలువరించడానికి ఏం చేయాలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. 


చంద్రబాబుపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐఎఎస్ అధికారులు ఆయనకు సూచించిన నేపథ్యంలో ఆ దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుపై పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నట్లు చెబుతున్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణపై ఎల్వీ సుబ్రహ్మణ్యం మీద ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు నమోదైంది. ఈ కేసు నుంచి హైకోర్టు 2018 జనవరిలో ఆయనకు విముక్తి ప్రసాదించింది. హైకోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు తనను నిందితుడి గా పేర్కొనడంపై ఎల్వీ సుబ్రహ్మణ్యం తీవ్రమైన అసహనంతో ఉన్నట్లు చెబుతున్నారు. 


ఎన్నికల కమిషన్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల వేళ సిఎస్ ను బదిలీ చేసి, ఎల్పీ సుబ్రహ్మణ్యాన్ని ఆ స్థానంలో నియమించడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పోలింగ్ జరిగిన రోజు నుంచి చంద్ర బాబు ఆయనను జగన్ కేసులో నిందితుడిగా విమర్శిస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: