ఏపి సిఎం ప్రధాని మోడీపై దండయాత్ర అయోమయం లో రాష్ట్రపాలన!

ఎన్డీఏ నుండి బయటపడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారికి బద్దశత్రువుగా మారిపోయాడు. నాడు నరేంద్ర మోడీ అంత శక్తిమంతుడు లేడని చెప్పిన బాబు నేడు మోడీ పరమనీచుడు అని చెపుతూ ప్రచారం మొదలెట్టాడు. ఆయన అభిప్రాయంతో ప్రజాభిప్రాయం మారాలని బాబు చిత్తంప్రకారం జనచిత్తం మారదు కదా! అంటున్నారు విశ్లేషకులు. 

దాదాపుగా గత సంవత్సరకాలం నుండి ఏపిలో పాలన స్థంబించింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం పాలన వదిలేసి ధర్మపోరాటం, ప్రతిపక్ష ఐఖ్యత, నవ నిర్మాణ పోరాటం అంటూ వీధులు పట్టి తిరిగి వందల కోట్ల ప్రజాధనం వృధా చేశారు. ఇప్పుడు ఏపి ఎన్నికల క్రతువు ముగిసిన దరిమిలా వివిధ రాష్ట్రాల దారిబట్టి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో మునిగి తేలుతున్నారు. రాష్ట్రం పాలన కొందరు అధికారులకు వదిలేసి పర రాష్ట్ర రాజకీయాలకు బాబు పరిమితమై పోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.   
 
తాజాగా నారా చంద్రబాబు నాయుడు కర్ణాటక ఎన్నికల ప్రచారానికి సిద్దమయ్యారు. ఏపీలో ఎన్నికలు ముగియడంతో పక్క రాష్ట్రాల్లోని పార్టీలకు ప్రచారం చేయబోతు న్నారు. ఇటీవల జేడీఎస్ వ్యవస్థాపకులు, మాజీ ప్రధాని దేవెగౌడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో, ఇప్పుడు చంద్రబాబు కూడా కర్ణాటకలో "జేడీఎస్-కాంగ్రెస్ కూటమి" కి మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నారు. దీనికోసం నేటి ఉదయం కర్ణాటక వెళ్లనున్న చంద్రబాబు, తొలుత మండ్యాలో ప్రచారం నిర్వహించనున్నారు.


కాగా, దక్షిణాదిలో బీజేపీకి పట్టు ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకే. 2014 ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో కర్ణాటకలో బీజేపీ 18 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ 10, జేడీఎస్ 3 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే గతేడాది జరిగిన రాజస్తాన్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత మోదీ గ్రాఫ్ పడిపోయిందని ప్రత్యర్థులు విమర్శిస్తూ వస్తున్నారు. దానికి తానే కారణమని చంద్రబాబు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో ఈసారి బీజేపీ గాలి ఎంతవరకు వీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

శాసనసభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయిన బీజేపీ, లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటి ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించు కోవాలని అనుకుంటోంది. అటు కాంగ్రెస్-జేడీఎస్ కలిసి పోటీ చేస్తున్నందున, ఈసారి కర్ణాటకలో బీజేపీని నిలువరించ వచ్చునని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: