తెలుగు ఆడపడుచు సుమలతకే దెబ్బకొట్టి పరువు ప్రతిష్ట కోల్పోతున్న చంద్రబాబు!

తన చేష్టలతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే పరువు ప్రతిష్ట గౌరవం కోల్పోతున్న చంద్రబాబు! సుమలత కమ్మకులస్తురాలు కాదు కాబట్టే ఆమెకు చంద్రబాబు మద్దతు నివ్వట్లేదని అంటున్నారు. ఇటీవల భర్తను కోల్పోయిన అలనాటి తెలుగు నటి సుమలత అనివార్య కారణాల రీత్యా రాజకీయ అరంగేట్రం చేసింది. ప్రతి ఒక్క అభిమాని సాయం కోరుతోంది. ఈక్రమంలో కన్నడ నాట ఎందరో అభిమానులు, సినీనటులు సుమలత తరఫున ప్రచారం చేస్తున్నారు. 

కన్నడ హీరోలు దర్శన్, యశ్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాకుండా కర్ణాటకలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వ్యక్తికి సుమలతపై సానుభూతి వ్యక్తం అవుతోంది. ఇలాంటి తరుణంలో ఒక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్ర బాబు నాయుడు సుమలతకు వ్యతిరేకంగా ప్రచారానికి రావడం ఏంటని కర్ణాటక వ్యాప్తంగా తెలుగు వారి నుంచి విమర్శలు వస్తున్నాయి. 

మండ్య మగాడిగా పేరొందిన అంబరీష్ భార్య సుమలత పట్ల అక్కడి ప్రజల్లో సానుభూతి ఉంది. శాండిల్‌ వుడ్ కూడా సుమలతకు అండగా నిలుస్తోంది. నిఖిల్ స్థానికేతరుడు కావడం జేడీఎస్‌కు ప్రతికూలంగా మారింది. దీంతో సామాజిక వర్గ అస్త్రాన్ని జేడీఎస్ బయటకు తీసింది. మండ్యలో ఇప్పటి వరకూ వొక్కలిగలు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుపొందారు. ఈసారి కూడా గౌడ అయిన నిఖిల్‌ కే ఓటేయాలని, బలిజ ‘నాయుడు’ సామాజిక వర్గానికి చెందిన సుమలతకు ఓటేయొద్దని మండ్య సిట్టింగ్ ఎంపీ పిలుపునిచ్చారు. దానికి చంద్రబాబు మద్దతు పలకకపోవటం తెలుగువాడిగా ఆయన గౌరవం కమ్మకులానికే పరిమితమైనదని అంటున్నారు. 


సుమలత ‘నాయుడు’ అని విమర్శించిన జేడీఎస్ నేతలు.. చంద్రబాబు ‘నాయుడి’ని ఎందుకు ప్రచారానికి తీసుకొచ్చారని సుమలత మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే. చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, సుమలత ‘బలిజ’ సామాజిక వర్గానికి చెందినవారు. వీరిద్దర్నీ మనం తెలుగు వ్యక్తులుగా చూస్తుంటే, ఎన్నికలంటేనే సామాజిక వర్గాల లెక్కలని భావించే కర్ణాటకలో కులం ఫీలింగ్‌ తో చూస్తున్నారు. 



మండ్య లోక్‌సభ స్వతంత్య్ర అభ్యర్థి సుమలతకు మద్దతు ఇవ్వాల్సింది పోయి, వ్యతిరేక ప్రచారం చేయడమేనా! 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని విమర్శిస్తున్నారు.
చంద్రబాబు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయ విలువలు ఉన్న వ్యక్తి అయితే ఇతర పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకూడదు. అయితే సుమలత బరిలో దిగింది స్వతంత్య్ర అభ్యర్థిగా కదా! అలాంటి సుమలతను కాదని, 40 ఏళ్లుగా కాంగ్రెస్‌పై పోరాటం చేసిన టీడీపీ అధినేత కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చిన జేడీఎస్‌ అభ్యర్థి తరఫున, తెలుగు ఆడపడుచుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. ఈమేరకు సోషల్‌ మీడియా వేదికగా చంద్రబాబు నెటిజర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.


– ఆంధ్రప్రదేశ్‌ ఆడపడుచుకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు. 
– ఆంధ్రుల మీద పోరాడు తున్నాడా? ఆంధ్రుల కోసం పోరాడుతున్నాడని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా?
– ఆంధ్రులకు అండగా నిలబడాల్సిన చంద్రబాబు మననోట్లో ఆలమట్టి పేరుతో -
– ఆంధ్రులకు అండగా నిలబడాల్సిన చంద్రబాబు ఎందుకు ఆలమట్టి పేరుతో మనకి మట్టి కొట్టిన దేవెగౌడ కి అండగా ఉంటున్నారు. 
– ఏంటి తమ్ముళ్ళు! మీ అన్న బాబు గారికి సిగ్గు ఉందా? 


– మండ్య అభ్యర్థి మన తెలుగింటి ఆడపడుచు సుమలతను ఓడించాలని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.
– సుమలత ఆంధ్ర ప్రదేశ్‌ కి చెందిన ఆడపడుచు. గుంటూరులో పుట్టిన ఆమెకు అండగా ఉండకుండా ఓడించే యత్నమేనా? నీ 40 ఏళ్ల నీచ రాజకీయ అనుభవం.
 – గుంటూరు లో పుట్టి సినీరంగంలో రాణించిన తెలుగింటి ఆడపడుచు.
 – ఆమె భర్త తుది గడియల వరకు చంద్రబాబు మిత్రుడు కాంగ్రెస్‌ లో ఉన్నారు. ఆమెకు టికెట్‌ ఇవ్వకపోతేనే ఆమె స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 
– ఆలోచించండి! బాబు చేసేది కేవలం స్వార్థ రాజకీయాలే! ఆంధ్రుల మేలు చంద్రబాబు ఎప్పుడూ కోరు కోరు! అనేదానికి ఇదే ఋజువు ఆయన ఆంధ్రప్రదేశ్‌ ద్రోహి.

– చంద్రబాబు తెలుగువాడై కూడా తెలుగు ఆడపడుచును ఓడించాలని అనుకోవడం తెలుగు జాతికే అవమానం. 
– ఇతర రాష్ట్రంలో మన తెలుగు మహిళను ఆదర్శంగా తీసుకుంటుంటే బాబు మాత్రం తెలుగు మహిళను ఓడించాలని పిలుపునివ్వడం తెలుగు ఆడపడుచులను కించ  పరచడమే అవుతుంది. 
– ఆడపడుచు ఎదగడం మన తెలుగువారి గౌరవంగా భావించడం ఒక నాయకుడి లక్షణం. కానీ అదే తల్లిని (సుమలత) తన రాజకీయ స్వార్థం కోసం ఓడించండి అని పిలుపు నిచ్చేందుకు వస్తున్న బాబు నీచ రాజకీయాల్ని తెలుగు వారందరు  తీవ్రంగా ఖండిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: