బాబు ప్రభుత్వంపై హరిప్రసాద్ ప్రమేయం అధికమట-ఈవీఎం విషయంలో చేసే యాగీ అంతా ఒక డ్రామానే!

నిజంగా చెప్పలంటే నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుండి తెలుగుదేశం ప్రభుత్వం ఒక వ్యూహంతో బయట పడింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను చంప కుండా బ్రతికిస్తూ వచ్చిన వైసిపిని ఎన్నికల్లో ఎదుర్కొని గెలుపు సాధించటం అసంభవమని గ్రహించి యూ-టర్న్ తీసుకొని ప్రత్యేక హోదాను హైజాక్ చేయటానికి చేయని ప్రయత్నమూ లేదు, పన్నని కుయుక్తీ లేదు.

పరిస్థితి ఎంతటి దయనీయమో తెలుగువాళ్ళకు చెప్పనవసరం లేదు. తనను ప్రజలు వలయంలా చుట్టుముట్టి కాపాడాలని రాష్ట్రంపై కేంద్రం దాడి చేయబోతుందని ఊదరగొట్టిన దయనీయ పరిస్థితి వర్ణనాతీతం. నేఱం చేయనివాడు ఎవరికీ భయపడదు. అది నిజం. 

ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏపికి మౌలిక సదుపాయాల పద్దు క్రింద లభించినన్ని నిధులు చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ కేంద్రం ప్రభుత్వమూ కేటాయించ లేదు మరియు విడుదల కూడా చేయ లేదు. వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంతనే ఈ లెక్కలకు విచారణ తప్పదు - అప్పుడైనా సమీప భవిష్యత్తులో తెలుగుదేశం నాయకత్వం లెక్కల వివరాలు సమర్పించవలసిందే.

తన వ్యూహాలు, అనుభవమే తనని కాపాడగలదన్న అతి విశ్వాసంతో ఎన్నికల్లో గెలవగలననే భావనతో ముందుకెళ్ళిన చంద్రబాబు కార్యకలాపాలపై కేంద్రం తన డేగకళ్లతో పరికిస్తూనే ఉంది. అసలు సిబీఐ వంటి నిఘా మరియు విచారణ సంస్థలను రాష్ట్ర ప్రవేశ నిషేధమే, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అవినీతి పనులు చేశాడని నమ్మేలా చేసింది. చంద్రబాబు దొరకబోయే దొంగ అని అందరికి తెలిసిపోయింది.

తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో టీఆరెస్ తొ పొత్తు కుదరక పోవటంతో చంద్రబాబు వేసిన పిల్లి మొగ్గలు చంద్ర మీడియా ఆడిన నాటకాలు తెలుగువారికి చిరస్మరణీయాలు. మరచిపోవాలన్నా మరచిపోలేరు. ఇంటెలిజెన్స్ ఐజీని ఇంటి పనులకు, పార్టీ పనులకు, పార్టీ రాజకీయాలకు పరిమితం చేయటంతో, మావోయిస్టుల కదలికలపై 'ఐబి' కి శ్రద్దపెట్టే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావును, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమును కూడా మావోయిస్టులు కాల్చిచంపారు. దీని బాధ్యత ఎవరు వహిస్తారు? అన్నది నేటికీ ప్రశ్నార్ధకమే.

అలాంటివే ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపై హత్యాప్రయత్నం ఆ తరవాత ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య. ప్రభుత్వ యంత్రాంగం, పాలన ప్రక్కన పెట్టి రాజకీయాల్లో నిమగ్నమవటంతో రాష్ట్రంలో పాలన అధ్యాయం ముగిసిపోగా, నాటి నుండి రాజకీయ అధ్యాయానికే తెరలేచింది. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాకపోతే రాజకీయ జీవితమే కాదు టిడిపి అధినేత ఆయన తనయుడు పార్లమెంట్, అసెంబ్లి సభ్యుల చరిత్ర ఫినిషింగుకు వచ్చేది గ్యారెంటీ. కారణం విచ్చలవిడిగా జరిగిన జన ధన ప్రకృతి వనరుల దోపిడీ. ఇక రాష్ట్ర మంత్రులు, ఇతర నేతల దుష్ట దుర్మార్గ కార్యాలు అనంతం అనిర్వచనీయం.

వీటిపై కొత్తగా కేంద్రంలో వచ్చే ప్రభుత్వం నిర్లిప్తంగా ఉండే ప్రశక్తి లేదు. కారణం వారు కూడా ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఎగ్గొట్టెసే ప్రయత్నం చేయకతప్పదు. ఖర్మకాలి రాహుల్ గాంధి నేతృత్వంలోని కాంగ్రెస్ పాతీఇ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు ఆధిపత్యాన్ని ఆది లోనే అదుపు చేయక తప్పదు కనుక ఆయన రాష్ట్రంలో జరిగిన దోపిడీపై విచారణకు ఆదేశించక తప్పదు. వ్యూహాలు చంద్రబాబు ఒక్కడి పేటెంట్లు మాత్రమే కావు కదా! బాబును సోనియా ఏ నాటికి నమ్మదు కాక నమ్మదు! 

ఇక నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజేపి అధికారంలోకి వస్తే తొలి కార్యక్రమమే ఏపిలో జరిగిన అవినీతి అరాచకాలపై విచారణ మొదలు పెడతారు. లేకపోతే ప్రతిపక్ష ఫ్రంట్ అధికారం - మమత బెనర్జి నాయకత్వం అధికారం హస్తగతం చేసుకుంటే ఆమె చంద్రబాబుతో కాకుండా జగన్మోహనరెడ్డితో చెలిమిచేయక తప్పదు. అప్పుడు కూడా ఇదే జరుగుతుంది. 

ఇదంతా ఆలోచించిన చంద్రబాబు ఎన్నికల్లో గెలవటానికి బహుశ కంప్యూటర్ హాకింగ్, డాటా మానేజ్మెంట్ నిపుణుడు వేమూరు హరిప్రసాద్ ను ఉపయోగించుకొని జిల్లా కలక్టర్స్, సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ తదితర జిల్లాల స్థాయి నుండే యంత్రాంగాన్ని పూర్తిగా హరిప్రసాద్ అదుపులోకి నెట్టి — ఆశా వర్కర్లు, ద్వాక్రా మహిళలు, జన్మభూమి కార్యకర్తలు, నారాయణ కళాశాలల ఉద్యోగులు, అన్ని వ్యవస్థల నిర్వహణనను కలుషిటం చేసి వారి బలహీనతల సహాయంతో ఎన్నికల కమీషన్ను ఇరుకున పెట్టి ఎన్నికల వాతావరణాన్ని కళంకితం చేసి ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలని అనుకున్నారు. కాని కేంద్రం రాష్ట్రంలోని ప్రతిపక్షం కూడా అంతే శ్రద్ద అదే రీతిలో డేగలా కాపు కాయటంతో చంద్రబాబు వ్యూహాలు బెడిసికొట్టాయి.

హరిప్రసాద్ అనబడే నిపుణుడికి గాలి చూరేంత అవకాశం ఎన్నికల సంఘం యివ్వకపోవటం - సిఈఓ జికే ద్వివేదిని స్వయంగా ముఖ్యమంత్రి కలసి బామాలినా, బెదిరించినా, కార్యం సుగమం కాలేదు. అందుకే ఈసి ఎందరిని తీసేసినా ఈ హరిప్రసాద్ లాంటి సిఎం స్వంత యంత్రాంగం - సిష్టం లోనే ఉండి కొన్ని అడ్డంకులు సృష్టించి ఎన్నికల నిర్వాహణ వ్యవస్థను అబాసు పాలు జేయచూశారు. కాని ముఖ్యమంత్రి స్థాయిలో రాజ్యాంగం నిర్వచించిన కార్యనిర్వాహక వ్యవస్థ రాష్ట్ర ప్రతినిధి ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠా స్థానంలోకి ఎల్వి సుబ్రమణ్యంను పోష్ట్ చేసి తెలివిగా ఎన్నికల సంఘం వ్యవహరించి తన పరువు కాపాడుకుంది.  

హరిప్రసాద్ వ్యవహారం విన్న తరవాత అమరావతిలో వినిపించిన రూమర్ అదే ఏపి సచివాలయాన్ని ప్రధాన కార్యదర్శి కాకుండా చంద్రబాబుకు అతి దగ్గర గా ఉండే ఒక వర్గ మీడియా లోని కొందరు ఉన్నతోద్యోగులు శాసించారన్న మాటల్లో నిజముందని నమ్మవలసి వస్తుందని విశ్లేషకులే కాదు చంద్రబాబును బాగా ఎరిగిన జనం కూడా అంటున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు దేశ వ్యాప్త  పర్యటన మోడీ శత్రుపక్షాలకు ఏపి ప్రభుత్వ ఖర్చుతో కుటిల వ్యూహంతో ఉచిత ప్రచారం మొదలెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: