చంద్రబాబు అధికారంపోతే బ్రతకలేరా! మరైతే ఈ రాజ్యాంగ వ్యతిరేఖ పనులేమిటి?

తానే ఒక లా మేకర్ అంటే శాసన నిర్మాత. నలభైయేళ్ళ సుధీర్గ రాజకీయ జీవిత నేపధ్యం. దానిలో పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిత్వం నెరిపిన గొప్ప అనుభవం ఇదంతా మనకు తెలిసిన ఏపి సిఎం చంద్రబాబు రాజకీయ నెపధ్యం. స్వతహాగా శాసన నిర్మాతైన ఏపి సిఎం, చట్ట వ్యతిరేఖ కార్యక్రమాలకు తెరతీయటం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. ఎన్నికల కోడ్ అనేది ఒక చట్ట ప్రక్రియ. అది అమల్లో ఉన్న వేళ సమీక్షలు నిర్వహించడం విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శల పాలవుతూ ఉన్నారు. 

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, తనే ముఖ్యమంత్రిని అని చెప్పుకొంటూ చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగబద్ధమైన విధానం కాదు కదా! రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నవేళ అధికారంలో ఉన్న వాళ్లు కేవలం అపద్ధర్మం గా వ్యవహరించాల్సి ఉంది. ఏపీలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలింగ్ పూర్తి అయినా ఫలితాలు వచ్చే వరకూ కూడా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ‘మొత్తం రాష్ట్ర పాలక వ్యవస్థ’  ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటుంది.



రాష్ట్రానికి ఎన్నికల కమిషనరే ఈ సమయంలో అధిపతిగా వ్యవహరిస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం పాలన జరగాల్సి ఉంటుంది. ఇదేమీ కొత్తగా జరుగుతు న్నది కాదు. మొదటి నుంచి అమల్లో ఉన్న నియమమే ఇది. దేశంలోని పాలకులు అంతా ఈసీని అలా గౌరవిస్తూ వచ్చారు. ప్రధాన ఎలక్షన్ కమీషనర్ గా "టీఎన్ శేషన్" ఉన్న సమయంలో “ఎన్నికల కమీషనర్-ఎన్నికల సంఘం” అంటే జనాలకు తెలిసొచ్చింది. 

అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తన అధికార దాహంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ చంద్రబాబు నాయుడు తనకు తోచినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని వెక్కిరించేలా ఉంది చంద్రబాబు నాయుడి తీరు. ఎండీఏ నుండి బయటకు వచ్చిన వెంటనే చంద్రబాబు అధికారం నుండి బయట పడ్డట్టు ప్రతిపక్ష నాయకుడిలా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఎన్నెన్న పేర్లతొ దీక్షలు మొదలెట్టి తను చేయకూడని ప్రభుత్వ వ్యతిరేఖ కార్యక్రమాలకు తెరలేపారు. 


సీఎం హోదాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహించకూడదని నియమాలు చెబుతున్నా, బాబు తనే ముఖ్యమంత్రిని అంటూ చెప్పుకుంటున్నారు. కోడ్ అమల్లో ఉన్న వేళ తను హోదాకు మాత్రమే సీఎం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రని తన ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం అనే విషయం చంద్రబాబుకు తెలియనిది కాదు. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు తీవ్రమైన అసహనంతో ఉన్నారు. అడ్డగోలుగా మాట్లాడుతు న్నారు. అధికార దాహంతో వ్యవస్థను కూడా తక్కువ చేసి మాట్లాడుతూ తనలాంటి వారే నిర్మించిన చట్టాలను ఉల్లంగిస్తూ వస్తున్నారు ఈ తెలుగుదేశం అధినేత.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: