"వైసీపీలో జనసేన"...విలీనం....???

NCR

ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ,  రాజకీయాల్లో సునామీ సృష్టిస్తుందని, జనసేన పార్టీ మద్దతుతోనే ఏపీలో ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతాడు అంటూ విశ్లేషకులు సైతం జనసేన పార్టీని ఆకాశానికి ఎత్తేశారు. పవన్ కళ్యాణ్ కూడా మనం 40 సీట్లు సాధిస్తే చాలు ఏపీలో మనం చెప్పిందే జరిగుతుంది. చక్రం తిప్పేస్తాం, అంటూ కుర్రాళ్ళలో ఊపు తెప్పించాడు. కుర్రాళ్ళలో ఊపు మాట ఏమో గానీ టీడీపీ , కాంగ్రెస్ నుంచీ మాజీ నేతలు జనసేనలోకి దూకేశారు. సీన్ కట్ చేస్తే.....

 

ఏపీలో ఎన్నికలు ముగిసి ఇప్పటికి 11 రోజులు కావస్తోంది. ఎన్నికల పోలింగ్ సరళి ని చూసి జగన్ సీఎం అని అధికార పక్షం అయిన టీడీపీ సైతం ఫిక్స్ అయ్యిపోయింది. వైసీపీ పార్టీ ఇప్పటికే సంబరాలు చేసుకుంటోంది. రిజల్స్ రోజున వైసీపీ జెండాలు ఏపీ వ్యాప్తంగా రెపరెపలాడటం ఖాయమని, పరిశీలకులు కూడా చెప్తున్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తేలు కుట్టిన దొంగలా కిమ్మనకుండా ఉన్నారు. రిజల్స్ తరువాత రాబోయే ఫలితాలపై ముందుగానే ఒక అంచనాకి వచ్చిన జనసేన పార్టీ సీట్ల లెక్కలపై, ప్రజలకి , కార్యకర్తలకి, అభిమానులకి  ఎలాంటి వివరణ ఇవ్వాలో అర్థం కాక  హైరానాపడుతోందట.

 

జాతీయ స్థాయి మీడియా మాత్రమే కాదు, లోకల్ సర్వేలు సైతం జనసేనకి 5 సీట్లకి మించి రావని తెల్చేస్తున్న తరుణంలో జనసేన పార్టీ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. పై పై కి మేకపోతు గాంభీర్యం ప్రదర్సిస్తున్నా ఫలితాల తరువాత పార్టీని ఏలా ముందుకు నడుపుతారు అనేది అతిపెద్ద సందేహంగా మారింది. ఈ సందేహం పార్టీలో కీలక వ్యక్తుల్లో కలగడం ఇప్పుడు పార్టీ భవిష్యత్తుపై ఆందోళనలు రేపుతోందట. అసలు పార్టీని ఉంచితే మంచిదా లేక రాబోయే అధికార పార్టీలోకి విలీనం చేస్తే మంచిదా అనే కోణంలో ఇప్పటికే కొంతమంది నేతలు పర్సనల్ గా చర్చించుకుంటున్నారనే  టాక్ వినిపిస్తోంది. అయితే ఈ తరహా సందేహాలు కలగడానికి కారణం లేకపోలేదు.

 

2009 లో అన్న చిరంజీవి ప్రజా రాజ్యం పెట్టి 18 సీట్లని గెలుచుకున్నా సరే కింగ్ మేకర్ అవ్వలేకపోయాడు. కానీ చిరంజీవికి అతి తక్కువ కాలంలోనే ప్రజాధరణ వెల్లువలా వచ్చిపడిందనేది మాత్రం అక్షరాలా సత్యం. కానీ ఆ సమయంలో చిరంజీవికి గత్యంతరం లేకపోవడంతో తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. కానీ ఇప్పుడు జనసేనకి కేవలం 5 సీట్లకంటే ఎక్కువగా రావని  18 సీట్లు వచ్చిన అన్నే పార్టీని నడపలేకపోయాడు ఇక పవన్ కళ్యాణ్ ఎలా పార్టీని ముందుకు నడుపుతారు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే

 

పవన్ కళ్యాణ్ కి 5 సీట్లు వచ్చినా లేక 10 సీట్లు వచ్చినా సరే  అధికారంలోకి వచ్చే ఏ పార్టీ అయినా ఆ అభ్యర్దులకి గేలం వేయక మానదు వారిలో పవన్ , మరొకరు మినహా ఎవరు ఉండకపోవచ్చు దాంతో పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా మారుతుందని ఆ పరస్థితి తలెత్తకుండానే ముందుగానే విలీనంచేసేస్తే బాగుంటుంది అనేది మరికొందరు చర్చించుకుంటున్నారట. ఇదే విషయం సోషల్ మీడియాలో సైతం హల్చల్ చేస్తోంది. గతంలో పవన్ ,జగన్ ఒక్కటే అనే టాక్ ఎలాగో రానే వచ్చిందని కదా దాన్ని ఉదాహరణగా చూపిస్తూ , జనసేన పార్టీ వైసీపీలో విలీనం కాబోతోందని, ఆ పార్టీలో ఒకరిద్దరికి మంత్రి పదవులు దక్కుతాయనే వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అనే మాట ఈ  సందర్భంలో గుర్తుకు రాక మానదు అంటున్నారు. అయితే ఈ పుకార్లని  జనసేన అధినేత లైట్ తీసుకుంటారో , లేక సైలెంట్ గా ఎప్పటిలాగానే కిమ్మనకుండా ఉంటారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: