పిల్లల భవిష్యత్ తగలడుతుంటే "కింగ్ కేసీఆర్ నీరోలా ఫిడేల్ వాయిస్తున్నారా!” ప్రజల ఆక్రోశం

తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డ్ పని తీరు అత్యంత భయంకరం. బంగారు తెలంగాణా నిర్మిస్తామన్న తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం నిష్క్రియా పరత్వాన్ని ప్రదర్శించటం జనంలో ప్రభుత్వ వ్యతిరేఖత స్పష్టంగా కనిపిస్తుంది.  ముఖ్యమంత్రి ఇలాంటి దుస్థితిలో కూడా ప్రగతి భవన్ నుండి బయటకు రాకపోవటం “రోము నగరం తగలబడుతుంటే పిడేల్ వాయించుతూ కూర్చొన్న రాజును గుర్తుచేస్తుంది ఈ దొరవారి పాలన” అని విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఇతర ప్రజలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ని దుమ్మెత్తి పోస్తున్నారు.

“మీరే ఏమైనా అనుకోండి. ఎన్ని అయినా అనుకోండి. నాకు నచ్చినప్పుడు నేను కోరుకున్నప్పుడు రియాక్ట్ అవుతా!” అన్న ధోరణి ఏమాత్రమైనా ప్రజాప్రతినిధులకు సమర్ధనీయమా? అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలంగాణ ప్రజానీకంలో తీవ్ర అసంతృప్తిని ఆగ్రహాన్ని అంతకంత కూ పెంచుతుంది. 

దాదాపు పదిలక్షల మందికిపైగా విద్యార్థుల సమస్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం మౌనం, అచేతనం, నిష్క్రియా పరత్వం ప్రదర్శించటం ముఖ్యంగా ముఖ్యమంత్రి తనకేం సంబంధం లేనట్లుగా వ్యవహరించటం మంచిది కాదంటున్నారు. విద్యార్థులు వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న ఇంటర్ పరీక్షా ఫలితాల ఎపిసోడ్ కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించింది లేదు. ముగ్గురు సభ్యుల బృందంతో కమిటీ వేసి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి చేతులు దులుపుకున్నారే కానీ జరిగిన తప్పును ఎలా సరిదిద్దాలన్న విషయం మీద ప్రభుత్వం నుంచి భరోసా కలిగించే ఒక్కమాట కూడా బయటకు రాలేదు.

ఇంటర్ బోర్డు వైఫల్యంపై మండిపడుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేయటం వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఓవరాక్షన్ చేయటం తో పరిస్థితి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఇంటర్ బోర్డును ముట్టడించేందుకు పలు విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మొహరించటంతో ముట్టడి విజయవంతం కాకున్నా తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది.

TDP Hyderabad dist committee termed the suicides of Intermediate students after declaration of exam results as “government killings"

ఈ సందర్భంగా కడుపు మండిన తల్లిదండ్రులు ఆవేదనతో విద్యార్థులు ప్రభుత్వాన్ని అధికారుల్ని, పోలీసుల్ని, మంత్రిమండలిని ప్రత్యేకించి కేటీఆర్-కేసీఆర్ ని తిట్టి పోయటం పిల్లల ఉసురు పోసుకోవటం మంచిది కాదంటూ, పలువురు తల్లిదండ్రులు శాపనార్థాలు పెట్టటం గమనార్హం. ఆందోళనలు నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇంత భారీగా నిరసనలు చోటు చేసుకుంటున్న వేళ, జరిగిన తప్పులను కరెక్ట్ చేసే పనిలో ప్రభుత్వం ఉందన్న ఉపశమనపు ప్రకటన ఒక్కటి కూడా ప్రభుత్వం నుంచి రాకపోవటం సరికాదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. 

ముఖ్యంగా ఈ విషయం వెనుక కార్పోరేట్ కళాశాల మయాజాలం ఏమైనా ఉందా అనే అనుమానాన్ని వెలిబుచ్చుతున్నారు. అంతే కాదు సాంకేతికంగా ఇప్పటివరకు ఇంటర్ బోర్డుకు మద్దతు ఇచ్చిన సంస్థ మ్యాగ్నటిక్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థను ఈ ఏడాది తప్పించారు కొత్తగా గ్లోబరీనా సంస్థకు కాంట్రాచ్త్ కట్టబెట్టటం ఈ సమస్యకు నాంది పలికిందని అంటూ జనం తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. 

లక్షలాది మందికి సంబంధించిన విషయంలోనూ ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ తీరుపై నిరసనలు ధ్వనిస్తున్నాయి. ఇది ఏ మాత్రం సరికాదంటున్నారు. పిల్లల ఉసురు ప్రభుత్వానికి మంచిది కాదన్న విషయం కేసీఆర్ కు మాత్రం తెలీదా!  మరెందుకు ఆయన మౌనంగా ఉన్నట్లు! మామూలుగా ఐతే ఇలాంటి విషయాల్లో కేసీఆర్ మౌనంగా ఉండరు. ఇప్పుడు ఆయనకేమైంది? అనేది ఎవరికి అర్ధంకావటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: