చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతీ చోటా అభ్యర్ధులు ఓడిపోబోతున్నారట!

తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రచారంలోకి వెళ్ళిన చోటల్లా చుక్కెదురు అవుతోంది. ఇటీవల ఎన్నికలు ముగియడం తో ఆయన కాంగ్రెస్‌ తరఫున తన రాష్ట్రం వదలి పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ప్రచారానికి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

రంగులు మార్చే చంద్రబాబు నాయుడు నాడు 2014 

ఊసరవెల్లిగా మారిన చంద్రబాబు నాయుడు నేడు 2019 

చంద్రబాబు రాకుండా ఉండి ఉంటే ఫలితాలు వేరేగా ఉండేవని, ఆయన రాకతో అక్కడ కాంగ్రెస్‌–జేడీఎస్‌ అభ్యర్థులు ఓడిపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఏపీ తరహాలోలాగే ఇక్కడ తనదైన శైలిలో మాట్లాడుతూ ఉండటంతో మీడియా ప్రతినిధులతో పాటు కాంగ్రెస్‌ నేతలు కూడా షాక్ కు గురి కావడం విశేషం.

మహామాయ సీబీఎన్ 

విలేకరులు ఏ ప్రశ్న వేసినా, సమాధానం ఇవ్వకుండా దాట వేస్తున్నారు. కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యం, రాహుల్‌ గాంధిని ప్రధానిని చేయడమే మన ఉద్దేశం అని పిలుపునిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నది పచ్చ మీడియా కాదుగదా! చెప్పింది అర్ధం చేసుకొని చంద్రబాబుకు అనుకూలంగా ప్రసంగాలు మార్చి రాయరు కదా! అక్కడ ఈయన సోది వినే తెలుగు తమ్ముళ్లు ఎవరూ కనిపించడం లేదు. ఏపీ తరహాలోనే కర్ణాటకలో కూడా ఖాళీ కుర్చీలే దర్శనం ఇచ్చాయి. ‘నేను జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పుతా! మోదీని గద్దెదించుతా!’ అని చంద్రబాబు చేసే చిత్రమైన ప్రసంగం ఇవ్వటంతో వినేవాళ్ళు కూడా మాయమైపోతున్నారట "చాలేవయ్యా! నీ సోది!" అంటూ.

చంద్రబాబు ప్రచారం చేసిన స్థానాలు


మండ్య – జేడీఎస్‌ అభ్యర్థి నిఖిల్‌ కుమారస్వామి  గౌడ తరఫున

రాయచూరు – కాంగ్రెస్‌ అభ్యర్థి బీవీ నాయక్‌ తరఫున రాహుల్‌ గాంధీతో కలిసి

కొప్పాళ – కాంగ్రెస్‌ అభ్యర్థి రాజశేఖర హిత్నాళ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.

 

*చంద్రబాబు ప్రచారం చేసిన పై మూడు స్థానాల్లో ఏ ఒక్క చోట కూడా కాంగ్రెస్‌-జేడీఎస్" కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని చెబుతున్నారు. మండ్యలో స్వతంత్య్ర అభ్యర్థి తెలుగునటి సుమలత గెలుపు దాదాపు ఖాయమని తెలుస్తోంది. జేడీఎస్‌ అభ్యర్థి నిఖిల్‌ కుమారస్వామికి అక్కడ ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా మన లోకెష్ లాగానే ఓడిపోతారని అంచనా వేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మండ్యలో జేడీఎస్‌ తరఫున ప్రచారం చేసినా తనకు ఎలాంటి నష్టం లేదని స్వతంత్య్ర అభ్యర్థి నటి సుమలత తెలిపారు. చంద్రబాబుకు షాక్ ఇస్తూ సెటైరికల్ గా తనను గెలిపిస్తే మండ్యను సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేస్తానని పరోక్షంగా చంద్రబాబుకు ఆమె కౌంటర్‌ ఇచ్చారు. (చంద్రబాబు ఎప్పుడూ, అమరావతి ని సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేస్తా అని ప్రగల్బాలు చెబుతుంటారు కదా!)


అంతే కాకుండా తెలుగింటి ఆడపడుచు స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగితే  మద్దతు ఇవ్వాల్సింది పోయి, ఓడించాలని ప్రచారం చేయడం ఆమె కుటుంబ మిత్రుడై ఉండీ ఇదేంటని నెటిజన్లు, తెలుగువారి నుంచి తీవ్రాతి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏపీలో గెలవలేని చంద్రబాబు ఓటమి భయాన్ని అణుచుకోవటనికే పక్క రాష్ట్రాలకు వెళ్ళి కాలం గడిపేస్తున్నాడని సుమలథ మద్దతు దారులు ఎద్దేవా చేస్తున్నారు.


*అదేవిధంగా రాయచూరు కాంగ్రెస్‌ అభ్యర్థి బీవీ నాయక్‌కు ఈసారి ఓటమి తప్పదని భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయచూరులో ప్రజలు తమ అభిప్రాయం మార్చుకోగా ఈసారి విభిన్న ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అక్కడ నరేంద్ర మోదీ హవా ప్రభావం బాగా ఉండటం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రాబల్యం డల్ అయిపోవటం కూడా కారణాలుగా చెప్పవచ్చు.


*అదేవిధంగా కొప్పళలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజశేఖర హిత్నాళ పై సిట్టింగ్‌ ఎంపీ కరడి సంగణ్ణ మరోసారి ఖచ్చితంగా గెలుస్తారని బీజేపీ నాయకులు ధీమాగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: